భార్యను ప్రేమిస్తున్నాడని.. 25సార్లు కత్తితో పొడిచి! | a man Stabbed 25 Times By his lovers Husband In Delhi | Sakshi
Sakshi News home page

భార్యను ప్రేమిస్తున్నాడని.. 25సార్లు కత్తితో పొడిచి!

Published Sun, Jul 2 2017 2:54 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM

భార్యను ప్రేమిస్తున్నాడని.. 25సార్లు కత్తితో పొడిచి! - Sakshi

భార్యను ప్రేమిస్తున్నాడని.. 25సార్లు కత్తితో పొడిచి!

న్యూఢిల్లీ: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని 25 సార్లు కత్తితో పొడిచి దారుణంగా హత్యచేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత శుక్రవారం ఈ దారుణ ఘటన ఈశాన్య ఢిల్లీలోని భజన్ పురాలో చోటుచేసుకోగా, తాజాగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఉత్తర్ ప్రదేశ్ అలీఘడ్ కు చెందిన వినోద్ కుమార్(38) అనే వ్యక్తి స్థానిక భజన్ పురాలో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో 23 ఏళ్ల షాను అనే వ్యక్తి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని వినోద్ అనుమానించాడు.

షాను తరచుగా తన ఇంటి చుట్టుపక్కల ఉండటాన్ని గమనించాడు. శుక్రవారం కూడా అదే విధంగా తన ఇంటి ముందు తచ్చాడుతుండగా షానును ఇంట్లోకి పిలిచాడు. షాను మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్న వినోద్.. ఒక్కసారిగా షాను మీద కత్తితో దాడికి దిగాడు. వినోద్ ఇంట్లో ఉన్న ఓ మైనర్ బాలుడు షానును వెనుకనుంచి గట్టిగా పట్టుకోగా.. నా భార్యను ప్రేమిస్తూ, ఆమెతో సంబంధం పెట్టుకుంటావా అని అరుస్తూ షానును కత్తితో 25 సార్లు పొడిచాడు. రక్తపుమడుగులో పడి ఉన్న షానును ఓ దుప్పటిలో చుట్టి ఇంటికి తాళం వేసి ఇద్దరు పరారయ్యారు. అదే రోజు రాత్రి అపార్ట్ మెంట్ వాసులు పోలీసులుకు ఫోన్ చేసి వినోద్ వ్యవహరం చెప్పారు.

ఉదయం వేళ ఆ ఇంటినుంచి అరుపులు వినిపించాయిని, అప్పటినుంచి వినోద్ కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాత్రి 10 గంటల సమయంలో వినోద్ ఇంటికి వచ్చిన పోలీసులు తాళాలు పగులకొట్టి లోనికి వెళ్లి పరిశీలించగా.. షాను చనిపోయి ఉన్నాడని గుర్తించారు. హత్య చేసేందుకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లో రక్తపు మరకలు శుభ్రం చేసిన వినోద్ తల్లిని పోలీసులు ప్రశ్నించారు. విచారణ ప్రారంభించిన పోలీసులు వినోద్ సొంతగ్రామం యూపీలోని అలీఘడ్ కు వెళ్లి వినోద్ కుమార్ తో పాటు హత్య చేయడంలో అతడినికి సహకరించిన మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. తన భార్యతో వివాహేతరం సంబంధం పెట్టుకున్నాడన్న కారణంగానే షానును అంతమొందించినట్లు నిందితుడు వినోద్ విచారణలో వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement