అవార్డుల్లో ఓరు‘ఘల్లు’ | Women's Day Award | Sakshi
Sakshi News home page

అవార్డుల్లో ఓరు‘ఘల్లు’

Published Sun, Mar 6 2016 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM

అవార్డుల్లో ఓరు‘ఘల్లు’

అవార్డుల్లో ఓరు‘ఘల్లు’

అరుదైన గౌరవం
మహిళా దినోత్సవం అవార్డుకు ఎంపిక  
సామాజిక సేవా రంగం నుంచి బాల థెరిస్సా, కమలమ్మ
జానపద విభాగం నుంచి సంధ్య

 
మహిళా దినోత్సవం రోజున అవార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల నుంచి 20 మంది మహిళలను ఎంపిక చేసింది.  ఎంపికైన మహిళల వివరాలను శనివారం వెల్లడించింది. అందులో మన జిల్లాకు చెందిన వారు ముగ్గురు  ఉన్నారు. శతృదేశాల రాజులను గడగడలాడించడంతో పాటు రాజ్యప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్న రాణిరుద్రమదేవి, వీరవనితలు సమ్మక్క-సారలమ్మ, దేశ్‌ముఖ్‌ల ఆగడాలను ఎదిరించిన చాకలి ఐలమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లా నుంచి నారీ‘మణు’లెందరో ఉన్నారు. ఇందులో కొందరినైనా సముచిత రీతిలో గౌరవించాలని రాష్ట్రప్రభుత్వం భావించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవార్డుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 20మందిని ఎంపిక చేయగా.. జిల్లా నుంచి ఆ గౌరవం ముగ్గురికి దక్కడం విశేషం. సామాజిక సేవా రంగంలో బాలథెరిస్సా, చెన్నబోరుున కమలమ్మతో పాటు జానపద రంగం నుంచి దివంగత జానదప గాయకుడు శంకరన్న సతీమణి సంధ్యారాణి ఎంపికయ్యూరు. హైదరాబాద్‌లో జరగనున్న కార్యక్రమంలో వీరు రాష్ట్రప్రభుత్వ పురస్కారం, రూ.లక్ష నగదు స్వీకరిస్తారు.
 
25 ఏళ్లుగా ప్రజాసేవ
 కాజీపేట రూరల్ : సమాజాభివృద్ధిలో మహిళలు భాగస్వాములుగా ఉన్నప్పుడే సంపూర్ణ వికాసం సాధ్యమని నమ్మి అంకితభావం, ఓర్పు ఎన్నో సుగుణాలు ఉండి అలుపెరుగని మహిళ యోధురాలు, బాలవికాస సంస్థ వ్యవస్థాపకురాలు సిం గారెడ్డి బాలథెరిస్సాను ఈ ఏడాది మహిళ అవా ర్డు వరించింది. సుమారు 20 జిల్లాలోని 1600 గ్రామాలలో 40 సంస్థల భాగస్వామ్యంతో 2,30,000 మంది మహిళలను సంఘాలుగా ఏర్పాటు చేసి వారి సమగ్రాభివృద్ధికి దోహదపడుతున్నారు. బాలథెరిస్సా 6000 గ్రామాల్లో అనాథ విద్యార్థులకు విద్య, రైతు సంఘాలు, వాటర్ ప్లాంట్లు, పేదవారికి ఇండ్లు, తాగునీరు పథకాలు, బోర్‌వెల్స్, ట్యాంక్‌ల నిర్మాణం లాం టి సామాజిక కార్యక్రమాలతో ఎంతో ఓర్పు, అంకిత భావంతో బాలథెరిస్సా బాలవికాస సంస్థను ముందుకు నడిపిస్తోంది. జిల్లాలోని వర్ధన్నపేట మండలం రెడ్డిపాలెంలో 1942లో సింగారెడ్డి చిన్నప్పరెడ్డి, చిన్నమ్మ దంపతుల రైతు కుటుంబంలో బాలథెరిస్సా పుట్టింది. విదేశాలకు ఉన్నతవిద్య కోసం వెళ్లింది. కెనడా దేశానికి చెందిన ఆంధ్రేజిగ్రాస్‌తో వివాహం చేసుకుంది. 1977లో కెనడాలో జింగ్రాస్, బాలథెరిస్సా సోపర్ ఆనే సచ్ఛంద సంస్థను స్థాపించిం ది. 1990లో సోపర్‌కు అనుబంధంగా వరంగల్ జిల్లాలో కాజీపేటలో బాలవికాస సేవసంస్థను స్థాపించారు. అప్పటి నుంచి ఈ సంస్థ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర సేవా కార్యక్రమాలను విస్తరింపజేశారు. అంతేకాక 57 దేశాల ప్రతినిధులు బాలవికాస సేవాకార్యక్రమాలపై శిక్షణ తీసుకుంటున్నారు.
 
అమ్మ జోలపాటే.. నా పాటకు ప్రేరణ
హన్మకొండ అర్బన్ : మహిళా దినోత్సవం సందర్భంగా రా ష్ర్టస్థాయిలో జానపద విభాగం నుంచి అవా ర్డుకు ఎంపికైన సంధ్యక్క(సంధ్యారాణి) ప్రస్తు తం  చింతగట్టులోని పే అండ్ అకౌంట్స్‌శాఖ లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తు న్నారు. అంతేకాకుండా టీఎన్జీవోస్ జిల్లా సం ఘంలో సాంస్కృతిక కార్యదర్శిగా కూడా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జానపదాలకు పుట్టినిల్లయిన ఓరుగల్లులో అందరికీ చిరపరి చితులైన శంకర్ భార్యే సంధ్య, శంకర్ 2005 ఏప్రిల్ 7న మరణించారు. ఆ తర్వాత కళాకారిణిగా ఎదిగేందుకు సంధ్య చాలా కష్టాలు పడ్డారు. సంధ్యకు గుర్తింపు తెచ్చిన ‘ఏలో ఉ య్యాలో... తందన తానా..’, ‘కొండా కోన ల్లో.. వాగుల్లో..’ ఆ పాటలు ఇప్పటికీ ప్రతి స్కూల్ పిల్లల కార్యక్రమాల్లో ఉంటాయంటే అది సంధ్య గొప్పతనంగా చెప్పాలి. అవార్డుకు ఎంపికైన సందర్భంగా సంధ్య మాట్లాడుతూ 1990నుంచి తాను పాటలు పాడుతున్నా తన కు రావాల్సిన గుర్తింపు రాలేదన్నారు. అయి తే, పాటను నేనెప్పుడూ వ్యా పార ధృక్పథం తో చూడలేదని తెలిపారు. ఉద్యోగంలో చేరిన తర్వాత టీఎన్జీవోస్ నాయకులు రాజేషన్న, రవన్న ప్రోత్సహించడంతో ఉద్యోగుల ఉద్య మంలో నా గొంతు వినిపించానని పేర్కొన్నా రు. అవార్డుకు ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. హన్మకొండ కుమా ర్‌పల్లికి చెందిన సరోజన-సారయ్య కుమార్తె అయిన సంధ్యకు ఓ కుమార్తె రాగమయి, కుమారుడు శివసాత్విక్ ఉన్నారు.
 
వీరోచిత మహిళ.. చెన్నబోరుున కమలమ్మ

వరంగల్ సిటీ / పోచమ్మమైదాన్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లో పాల్గొనడమే కాదు.. వర్గ సంబంధమే గొప్పదని నమ్మి కన్నబిడ్డను ఆరు నెలల వయస్సులో వదిలేసి వెళ్లిన ఆ ధీరవనిత పేరను ఓసారి నోబుల్ బహుమతికి జాతీయ మహిళా సమాఖ్య నుంచి ప్రతిపాదించారు.. అంతటి ధీరోధాత్తురాలైన చెన్నబోరుున కమలమ్మ తన 16వ ఏటనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. మంచి గాత్రం ఉన్న ఆమె నోటినుంచి ఎన్నో జాదపదాలు జాలువారారుు. సైసై గోపాలరెడ్డి.. నీవు నిలిచావు ప్రాణాలొడ్డి.. అంటూ కమలమ్మ పాడిన పాట ఆ కాలంలో చాలా పాపులర్.

ఇదీ నేపథ్యం..
అప్పటి మానుకోట(మహబూబాబాద్) సమీపంలోని నెల్లికుదురు మండలం నైనాల గ్రా మంలో రంగమ్మ-రంగారావులకు కమలమ్మ జన్మించింది. చిన్నతనంలోనే ఆమెకు మాజీ ఎమ్మెల్యే దివంగత మద్దికాయల ఓంకార్ సమకాలికుడైన ముకుంద అలి యూస్ అప్పన్నతో వివాహం జరిగింది. సహజంగా ఉద్యమ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో పాటే భర్త కూడా ఉద్యమకారుడే కావడంతో కమలమ్మ అడుగులు అటే పడ్డారుు. అప్పట్లో దళ కమాండర్‌గా ఉన్న అప్పన్నతో వెళ్లేందుకు తన ఆరు నెలల పసిగుడ్డు(కుమారుడు)ను వదిలేసి రక్త సంబంధం కంటే వర్గ సంబంధమే గొప్పదని నిరూపించారు. ఇక పోరాట జీవితంలో మరో ఆడ బిడ్డ జన్మించినా కోయ జాతి ప్రజలకు అప్పగించేసి తన జీవితాన్ని ఉద్యమానికే అంకితం చేసింది.

కడు దయనీయం..
కమలమ్మ భర్త అప్పన్న 1991లో కన్నుమూ యగా ఆమె ప్రస్తుతం దీనస్థితిలో జీవనం సాగి స్తోంది. ఈమె చిన్నతనంలో వదిలేసిన కుమారుడు సత్యనారాయణ కుమారుడైన సురేష్ వద్ద మర్రి వెంకటయ్య కాలనీలోని అద్దె ఇంట్లో ఉంటోంది. సత్యనారాయణ 1981-86 కాలంలో 24వ డివిజన్ కార్పొరేటర్‌గా స్వతంత్య్రుడిగా గెలిచారు. ఆయన మరణం తర్వాత కుమారుడైన సురేష్ ఏను మాముల వ్యవసాయ మార్కెట్‌లో చిరుద్యో గం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం కమలమ్మ కూడా ఆయన వద్దే జీవిస్తోంది. ఈమేరకు ఆమెను రాష్ట్రప్రభుత్వం సామాజిక సేవా విభాగం నుంచి అవార్డుకు ఎంపిక చేయగా.. విలేకరులు పలకరించినప్పుడు తన సంతోషం వ్యక్తం చేస్తూ పలు అంశాల ను వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement