మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ యోగితారాణా
సాక్షి,సిటీబ్యూరో: బంధువుల నుంచే దాదాపు 90 శాతం చిన్నారులు లైగింక వేధింపులకు గురవుతున్నారని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా అన్నారు. శుక్రవారం బేటి బచావో–బేటి పడావో కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అమ్మాయిలపై కాకుండా అబ్బాయిలపై కూడా లైగింక వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. కౌమార బాలికల, సంరక్షణ, పోషకాహారం, రుతుక్రమం, లైంగికదాడులపై తల్లిదండ్రులను చైతన్యం చేసేందుకు జిల్లా స్థాయి నుంచి క్లస్టర్ స్థాయి వరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. బాలికల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని, పీవోసీఎస్‌వో చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. నో, గో, టెల్ అనే పదాలతో పిల్లలకు అర్ధం అయ్యేలా చెప్పాలన్నారు. సురక్షితమైన స్పర్ష, ఫోక్సో చట్టంపై చిన్నారులకు అవగాహన అవసరమన్నారు. పిల్లల అఘాయిత్యాలు ఎదురైతే గట్టిగా అరవడం, గో అంటే అక్కడి నుంచి పరుగెత్తి చెప్పడం, టెల్ అంటే భయపడకుండా ఆసంఘటన చెప్పడం నేర్పించాలన్నారు.
అవసరమైతే 1098కు ఫోన్ చేసేలా చైతన్యం కల్గించాలన్నారు. నోడల్ అధికారి డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ గర్భిణీలు అల్ట్రాసౌండ్ చెక్ ఆప్ కోసం వెళ్లినప్పుడు లింగనిర్ధారణ చేసే సెంటర్లపై నిఘా పెట్టాలని సూచించారు. బ్రూణ హత్యలను నియంత్రించాలన్నారు. ఆడపిల్లలను చంపవద్దని ప్రభుత్వానికి అప్పజెప్పాలని వారిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గర్బిణీæ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలవరీ అయితే నాలుగు విడుతలుగా డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా సంక్షేమ అధికారి సునంద మాట్లాడుతూ 914 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం పంపిణీ చేస్తున్నామని, గర్భిణులకు 16 గుడ్లు ఇవ్వడం ఇస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద ప్రతి గర్భిణీ స్త్రీ పేరును అంగన్ వాడి కేంద్రాల్లో నమోదు చేయించాలన్నారు. ఆర్‌బీఎస్‌కే శ్రీవాణి మాట్లాడుతూ పుట్టుకతోనే వచ్చే లోపాలు గుర్తించి వారికి చికిత్స అందజేస్తున్నామని, రక్తహీనతతో బాధపడే వారికి ఐరన్ ఫోలిక్ మాత్రలు అందజేస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ ఐఓఎస్ ప్రసన్న మాట్లాడుతూ చిన్నారులను పెంచుకోలేని పరిస్ధితిలో చిన్నారులను హాస్టళ్లు, శిశు విహార్‌లో చేర్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అర్బన్ కమిటీ డెవలప్‌మెంట్ అడిషనల్ కమిషనర్ భాస్కరాచారి. ప్రాజెక్టు డైరెక్టర్ డి.సౌజన్య , ఇంతీయాజ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment