
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ దయానంద్
వరంగల్ సిటీ: మార్కెట్లో వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్న అడ్తి, వ్యాపారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని వరంగల్ అర్బన్ జేసీ దయానంద్ సూచించారు. శుక్రవారం మార్కెట్‌లోని చైర్మన్ చాంబర్‌లో కార్యదర్శి పి.నిర్మల, చైర్మన్ కె.ధర్మరాజుల అధ్యక్షతన పత్తి కొనుగోలు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను బేఖాతర్ చేస్తున్న వరంగల్ మార్కెట్ వ్యాపారుల మీద మార్కెటింగ్ శాఖకు, సంబంధిత మంత్రికి మంచి అభిప్రాయం లేదన్నారు. ముఖ్యంగా లైసెన్సుల రెన్యువల్స్ విషయంలో 58,39,369 జీఓలను విడుదల చేసి,మీ అభ్యర్థన మేరకు అనేక సవరణలు చేసిన వాటిని పాటించకుండా,కోర్టుకు వెళ్లడం సబబేనా అని ప్రశ్నించాడు.
ఇప్పటి వరకు కూడా సగం వరకే లైసెన్సులు రెన్యువల్స్ అయ్యాయని, రెన్యువల్స్ కోసం సమర్పించిన ఫారాలు కూడా చాలా వరకు సరిగా లేనట్లు తెలిపారు. జూన్ 30వ తేదీతో మూడు సార్లు లైసెన్సులు రెన్యువల్స్ సమయం పొడిగించిన వ్యాపారుల్లో చలనం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
ఎప్పటిలాగానే పత్తి కొనుగోళ్లు రూల్స్ ప్రకారమే చేపట్టాలని, కొనుగోళ్ల సమయంలో లైసెన్సుల తనిఖీలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుల్లో అక్రమాలు ఉన్నట్లు తేలితే పూర్తి ఫర్మ్ రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. సమావేశంలో జేడీఎం సామ్యేల్‌రాజ్, డీడీ ఎల్లయ్య, తెలంగాణ కాటన్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, అడ్తి, వ్యాపారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment