కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. నగరంతోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీఎల్‌ఓలు ప్రతి కళాశాలకు వెళ్లి విద్యార్థులకు ఓటు కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాన్నిచ్చింది. ప్రధానంగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ఓటరు నమోదు పెరిగేం దుకు దోహదం చేసినట్లు గణాంకాలు చెబుతు న్నాయి.
జిల్లాలో నవంబర్ 30న ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాలో 18 నుంచి 19 ఏళ్ల వయసున్న వారు 34,182 మంది ఉండగా... ప్రస్తుతం తుది జాబితాలో 67,716 మంది ఉండడం విశేషం. మూడు నెలల కాలంలో రెట్టింపు సంఖ్యలో యువ ఓటర్ల నమోదు పెరిగినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నారుు.
అయినా తక్కువే...
యువ ఓటర్ల నమోదు శాతం పెరిగినప్పటికీ... జిల్లా జానాభాతో పోల్చిచూస్తే ఈ నమోదు సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది. తాజా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 36,02,384 గా నమోదైంది. జనాభా ప్రాతిపదికన చూస్తే 18 నుం చి 19ఏళ్ల వయసున్న యువ ఓటర్లు 3.99 శా తం. ఈ లెక్కన 1,43,625 మంది ఓటరు జా బితాలో ఉండాలి.
ప్రస్తుతం 67,716 మంది (1.88 శాతం) మాత్రమే ఉన్నారు. అంటే... వీరి నమోదు మరో 2.11 శాతం పెరగాలి. గతంతో పోల్చితే మాత్రం ప్రస్తుతం ఓటర్ల జాబితాలో యువ ఓటర్ల హవా పెరిగిందని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఒక్కరోజే 9,505 దరఖాస్తులు
జిల్లాలో పోలింగ్ బూత్‌లవారీగా ఈ నెల తొమ్మిదో తేదీన చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమంలో యువత నుంచి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చారుు. ఈ ఒక్క రోజే 18 నుంచి 19 ఏళ్ల వయసున్న వారి నుంచి జిల్లావ్యాప్తంగా 9,505 దరఖాస్తులు (ఫారం-6) అధికారులకు అందాయి. వీరికి జాబితాలో చోటుకల్పిస్తే యువ ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.