బంజారాహిల్స్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చిత్రవిచిత్రమైన కేసులు వస్తున్నాయి. ఈ కేసులు చూసి పోలీసులకు నవ్వాలో, ఏడ్వాలో కూడా అర్థం కావడం లేదు. సోమవారం ఉదయం ఓ యువతి పోలీస్ స్టేషన్‌కు వచ్చి సార్.. నా బాయ్‌ఫ్రెండ్‌ను చూడాలని ఉంది.. దయచేసి వెళ్ళేందుకు పోలీసు అనుమతి ఇవ్వండి అంటూ వచ్చింది. ఆమె అభ్యర్ధన విన్న పోలీసులు షాక్‌కు గురయ్యారు. వాస్తవానికి ఆమెను ప్రేమిస్తున్న యువకుడు ఆదివారం ఉదయం అంబర్‌పేట నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం. 12కు వచ్చాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మా అమ్మాయిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ఆమె మీద తనకు ఎలాంటి ఇష్టం లేదని చెప్పడానికే తానే వచ్చానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అయితే తన బాయ్‌ఫ్రెండ్‌ను తాను కలవాల్సిందేనని అనుమతి ఇవ్వాలంటూ బైఠాయించింది. దీంతో ఆమెకు సర్దిచెప్పి పంపించేశారు.
Comments
Please login to add a commentAdd a comment