చెల్లెల్ని ప్రేమించాడని చంపేశారు | Youngster killed by love sister | Sakshi
Sakshi News home page

చెల్లెల్ని ప్రేమించాడని చంపేశారు

Published Thu, Jun 18 2015 11:54 PM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM

చెల్లెల్ని ప్రేమించాడని చంపేశారు - Sakshi

చెల్లెల్ని ప్రేమించాడని చంపేశారు

కరీంనగర్(గోదావరిఖని): గోదావరిఖనిలోని ఎయిట్‌ఇన్‌క్లెయిన్ కాలనీలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. వివరాలు.. కాలనీకి చెందిన సదానందం(25), అదేకాలనీకి చెందిన పులిపాక సతీష్ చెల్లెలు ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వరసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. ఈ విషయం గురించి పలుమార్లు సతీష్, సదానందంను హెచ్చరించినా పెడచెవిన పెట్టడంతో పరువు పోతుందని భావించి సతీష్ కుటుంబసభ్యులంతా కలిసి గురువారం రాత్రి గొంతునులిమి చంపేశారు.

పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు న మోదు చేసుకున్నారు. వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సతీష్‌తో ఈ హత్యలో పాల్గొన్న కుటుంబసభ్యులు, అతని స్నేహితుడు కటిక శేఖర్‌లు పరారీలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement