ప్రేమిస్తున్నానంటూ యువకుడి హంగామా | youth harassed woman | Sakshi
Sakshi News home page

ప్రేమిస్తున్నానంటూ యువకుడి హంగామా

Published Mon, Sep 14 2015 6:21 PM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM

ప్రేమిస్తున్నానంటూ యువకుడి హంగామా

ప్రేమిస్తున్నానంటూ యువకుడి హంగామా

బంజారాహిల్స్ : తను ప్రేమిస్తున్న యువతి కోసం ఓ యువకుడు అర్ధరాత్రి ఆమె పనిచేస్తున్న ఇంటి యజమాని ఇంట్లోకి ప్రవేశించాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో నివసించే వినోద్‌సింగ్ కొంతకాలంగా జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టు కాలనీలో ఓ వ్యాపారవేత్త ఇంట్లో పని చేస్తున్న యువతిపై మనసు పారేసుకున్నాడు. ఆమెకు తరచూ ఫోన్ చేస్తూ ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. తనకు మరొకరితో పెళ్లి నిశ్చయమైందని ఆమె చెప్పగా...'నన్ను కాదని ఎవరిని పెళ్లి చేసుకున్నా అతడితోపాటు నిన్ను కూడా చంపేస్తా'.. అంటూ వినోద్ బెదిరిస్తున్నాడు.

దీనిపై బాధితురాలు తన కుటుంబసభ్యులకు తెలిపి మూడు రోజుల నుంచి పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకుంది. కాగా వినోద్ అర్ధరాత్రి యువతి పని చేస్తున్న ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమె ఉండే గది వద్ద తచ్చాడుతుండగా అప్పుడే అటుగా వచ్చిన ఇంటి యజమానిని చూసి పరారయ్యాడు. ఈ విషయాన్ని బాధిత యువతి దృష్టికి యజమాని తీసుకురాగా ఆమె సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వెంటపడి వేధిస్తున్న వినోద్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement