సంగారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్ల తీర్పు కీలకంగా మారనుంది. నియోజకవర్గంలో రెండు లక్షల పైచిలుకు ఓటర్లుండగా వారిలో 83 వేలకుపైగా యువత ఉంది.
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్ : సంగారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్ల తీర్పు కీలకంగా మారనుంది. నియోజకవర్గంలో రెండు లక్షల పైచిలుకు ఓటర్లుండగా వారిలో 83 వేలకుపైగా యువత ఉంది. దీంతో సంగారెడ్డి నియోజకవర్గ బరిలో ఉన్న ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు యువ ఓటర్లను ఆకట్టుకునే వ్యూ హాలకు పదునుపెడుతున్నారు. వారిని ఆకట్టుకునేందుకు ఇంటర్నెట్, ఫేస్‌బుక్ ద్వారా అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలు చేసుకుంటున్నారు. అలాగే ప్రలోభాలకు తెరతీస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాష్‌రెడ్డి యు వ ఓటర్లను ప్రధానంగా ఆకట్టుకునేందుకు ప్రచార సీడీలో పవన్‌కల్యాణ్ త నను గురించి ఆసక్తిగా చెప్పిన మాటలను పొందుపర్చారు. టీఆర్‌ఎస్ సైతం తెలంగాణ వాదం ఆలంబనగా యువ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు అభ్యర్థులు తమదైనశైలిలో యువ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మ రోవైపు ఎన్నికల సంఘం సైతం యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోమంటూ ప్రోత్సహిస్తోంది.
ఓటరు పండుగ పేరిట ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్న వారికి బహుమతులు ప్రకటించటంతో పాటు లీటరు పెట్రోలుకు రూ. రూపాయి తగ్గిస్తున్న ట్లు ఆఫర్ ప్రకటించింది. యువ ఓ టర్లు సైతం ఎన్నికల్లో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు పొందిన 18 ను ంచి 19 సంవత్సరాల యువ ఓటర్లు సాధారణ ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు.