
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే.చంద్రశేఖరరావు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మధ్య ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశం ముగిసింది. సుమారు నాలుగు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. విభజన సమస్యలు, కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం, విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలోని అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను వైఎస్ జగన్ ఆహ్వానించారు.
వీలైనంత తక్కువ భూసేకరణతో, తక్కువ నష్టంతో గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేయాలని ఇరువురు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ఇరు రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండేలా జలాల తరలింపు, నీటి వినియోగం ఉండాలని.. ఇందుకోసం ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇతర అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో 18 వేల మంది పోలీసులను ఒకేసారి నియమిస్తున్నందున అందులో 4 వేల మందికి ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణనివ్వాలని కేసీఆర్, వైఎస్ జగన్‌ను కోరారు.
చదవండి : కేసీఆర్, వైఎస్ జగన్ ప్రత్యేక భేటీ
Comments
Please login to add a commentAdd a comment