ముంబయి: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సీనియర్ పాత్రికేయులు జే. డే(జ్యోతిర్మయ్ డే) హత్య కేసుకు సంబంధించి నిందితులందరిపై ప్రత్యేక కోర్టు అభియోగాలు నమోదు చేసింది. పది మందిపై చార్జీ షీటు ఖరారు చేసింది. వీరిలో మరొక జర్నలిస్టు జిగ్నా వోరా అనే మహిళ కూడా ఉన్నారు. కుట్ర పూరితంగా జే డేను చంపడంతోపాటు, చంపినవారందరికీ మాఫియాతో సంబంధాలు ఉన్నాయనే అభియోగాలు కూడా అందులో పేర్కొన్నారు. 2011 జూన్ 11న సుబర్బన్ పొవాయ్ ప్రాంతంలో ఉదయంపూట రెండు మోటార్ సైకిళ్లపై వచ్చిన కొందరు వ్యక్తులు జ్యోతిర్మయి డేపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.
దీంతో ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయారు. ఈ కేసులో జిగ్నా వోరాను అదే సంవత్సరం నవంబర్ నెలలో అదుపులోకి తీసుకొని విచారించగా కీలక ఆధారాలు బయటపెట్టింది. వాటి ఆధారంగా పదిమందిపై అభియోగాలు నమోదుచేశారు. మాఫియా డాన్ చోటా రాజన్ కు వ్యతిరేకంగా అనేక ఆర్టికల్స్ రాశారనే కారణంతో జేడేను హతమార్చినట్లు ప్రాథమిక దర్యాప్తు ద్వారా తెలుస్తోంది. మిడ్ డే అనే పత్రికకు జే డే ఎడిటర్గా పనిచేశారు.
జర్నలిస్టు హత్యకేసులో పదిమందిపై చార్జీషీటు
Published Mon, Jun 8 2015 6:21 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM
Advertisement