జీపుపైకి దూసుకెళ్లిన రైలు: 13 మంది మృతి | 13 killed as train hits jeep at unmanned crossing | Sakshi
Sakshi News home page

జీపుపైకి దూసుకెళ్లిన రైలు: 13 మంది మృతి

Published Fri, May 9 2014 11:06 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM

13 killed as train hits jeep at unmanned crossing

ఉత్తరప్రదేశ్ మహారాణిగంజ్లో కోఠిపూర్ సమీపంలో జీపుపైకి రైలు దూసుకెళ్లింది. ఆ ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రమాదం గత అర్థరాత్రి చోటు చేసుకుందని, క్షతగాత్రులను సమీపంలోని  ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు.

 

వివాహ వేడుకలలో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న జీపు భద్రత సిబ్బంది లేని రైల్వే లెవెల్  క్రాసింగ్ మీదకు రాగానే... అప్పుడు వచ్చిన రైలు ఆ జీపుపై నుంచి దూసుకుపోయిందని పోలీసులు వివరించారు. ఆ ఘటనపై మరింత సమాచారం అందించవలసి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement