
కట్టేసి చంపబోయారు.. కానీ..
బైహతా: గుట్టుచప్పుడు కాకుండా ఊళ్లోకి ఎంటరైన భారీ కొండచిలువ.. కనిపించిన మేకను క్షణాల్లో వేటాడి అమాంతం మింగేసింది. అదే, మేక స్థానంలో ఏ పిల్లలో ఉండుంటే? ఆలోచించడానికే ఒళ్లుజలదరిస్తోందికదూ! అందుకే ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు కొండచిలువను కట్టేసి చంపబోయారు. కానీ.. చివరికి మనసుమార్చుకుని ఫారెస్ట్ ఆఫీసర్లకు కబురుపెట్టారు.
అసోంలోని బైహతా అనే ఊళ్లో ఇటీవలే జరిగిన సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పలు అంతర్జాతీయ వెబ్‌సైట్లు సైతం ఈ వార్తను విశేషంగా రాశాయి. దాదాపు 15 అడుగుల పొడవున్న కొండచిలువ.. మేకను అమాంతం మింగేయడంతో పొట్ట బెలూన్‌లా ఉబ్బిపోయింది. కదలలేని స్థితిలో ఉన్న కొండ చిలువను గ్రామస్తులు గమనించి, దాని తల భాగాన్ని తాళ్లతో కట్టేశారు. చంపాలనే ఆలోచన విరమించుకుని, కాసేపు దానితో ఆడి ఫారెస్ట్ ఆఫీసర్లకు అప్పగించారు. వాళ్లు దానిని తిరిగి అడవిలో వదిలేశారు.