ముంబైలో బాలికపై గ్యాంగ్ రేప్ | 17 year old girl gangraped by autowalas in mumbai | Sakshi
Sakshi News home page

ముంబైలో బాలికపై గ్యాంగ్ రేప్

Published Wed, Nov 27 2013 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM

17 year old girl gangraped by autowalas in mumbai

 ముంబై: లైంగిక దాడుల విషయంలో ఢిల్లీ సంస్కృతి ముంబైకీ పాకినట్లుంది! ఇటీవలే వరుస లైంగిక దాడులతో మార్మోగుతున్న ముంబై నగరంలో ఒక బాలిక నలుగురి చేతిలో సామూహిక అత్యాచారానికి గురైంది. ఒక ఆటోవాలా, అతని స్నేహితులైన మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇది గమనించిన మరో యువకుడు బాధితురాలిని ఆదుకోవాల్సింది పోయి.. మానవత్వం మరిచి తాను క్రూరంగా దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌చేయగా స్థానిక కోర్టు వారికి పోలీసు కస్టడీకి పంపింది. ఈ కేసు వివరాలను ఎంహెచ్‌బీ పోలీసు స్టేషన్ అధికారి మీడియాకు తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక ముంబైలోని గణపత్ పాటిల్ నగర్‌లో నివసిస్తోంది. తల్లి వదిలేయడంతో.. స్నేహితుడి సంరక్షణలో ఉంటోంది. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో తినడానికి ఏమైనా తెచ్చుకుందామని ఒక్కతే బయటకు వచ్చింది. తెలిసిన ఆటో డ్రైవర్ సోనుకాంబ్లే బాలికను దారిలో అడ్డగించాడు. ఆమెను బలవంతంగా లింక్ రోడ్డులో నిలిపి ఉంచిన టెంపోలోకి లాక్కెళ్లాడు. అనంతరం సోను స్నేహితులైన ఆటో డ్రైవర్లు జైప్రకాశ్‌పాల్, అస్లామ్‌ఖాన్ కూడా టెంపోలోకి ప్రవేశించి ముగ్గురూ కలిసి లైంగిక అకృత్యానికి పాల్పడ్డారు. ఇది గమనించిన ఒక వ్యక్తి కూడా టెంపోలోకి ప్రవేశించి బాలికపై అత్యాచారం చేశాడు. ఆమె అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకున్నారు. పారి పోబోతున్న జైప్రకాశ్‌ను పట్టుకుని గస్తీ పోలీసులకు అప్పగించారు. తనపై జైప్రకాశ్ సహా నలుగురు అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు వాం గ్మూలం ఇచ్చింది. కేసు నమోదు అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు సోమవారం రాత్రే సోను, అస్లాంను కూడా అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. పోలీసులు ముగ్గురినీ మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టగా, డిసెంబర్ 2 వరకు వారిని పోలీసు కస్టడీకి అప్పగించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement