autowalas
-
ఆటోవాలాకు జగనన్న అండ
సాక్షి, కుప్పం : తీవ్ర సంక్షోభంలో సాగుతున్న ఆటోవాలా జీవితాల్లో వెలుగులు నింపడానికి వైఎస్ జగన్ ప్రకటించిన హామీలపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ అధికారంలోకి ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ కట్టుకోవడానికి ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.10 వేలు చొప్పున వారి ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. రోజుకు సగటున రూ.150నుంచి రూ.200 సంపాదించుకునే ఆటో డ్రైవర్లకు పెనుభారంగా మారిన ఫిటెనెస్ సర్టిఫికెట్ తీసుకోవడం గగనంగా మారింది. భారీగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు, వాహన ఇన్సూరెన్స్ ప్రతి ఏటా భారమై పోయింది. చదువుకున్న యువతకు ఉపాధి లేక వేలాదిమంది నిరుద్యోగులు ఆటో తోలుకుంటూ జీవనం గడుపుతున్న వారికి వైఎస్ జగన్ హమీ భరోసా ఇస్తోంది. కాలంతో పాటు పరిగెత్తి అలసిపోతున్న జీవితాలకు జననేత జగనన్న ఇచ్చిన హామీ ఉపశమనం కలిగిస్తోందంటున్నారు. వైఎస్ జగన్ మాటే భరోసా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పది వేల రూపాయిలు ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ మాటే మాకు కొండంత అండ. వైఎస్ జగన్ మాటే మాకు భరోసా. పెరిగిపోతున్న చమురు ధరలు, అప్పులకు వడ్డీలు కట్టలేని ఆటోడ్రైవర్ల పరిస్థితిని తెలుసుకుని ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం హర్షనీయం. – ఎం. మహమ్మద్, రామకుప్పం -
ముంబైలో బాలికపై గ్యాంగ్ రేప్
ముంబై: లైంగిక దాడుల విషయంలో ఢిల్లీ సంస్కృతి ముంబైకీ పాకినట్లుంది! ఇటీవలే వరుస లైంగిక దాడులతో మార్మోగుతున్న ముంబై నగరంలో ఒక బాలిక నలుగురి చేతిలో సామూహిక అత్యాచారానికి గురైంది. ఒక ఆటోవాలా, అతని స్నేహితులైన మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇది గమనించిన మరో యువకుడు బాధితురాలిని ఆదుకోవాల్సింది పోయి.. మానవత్వం మరిచి తాను క్రూరంగా దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌చేయగా స్థానిక కోర్టు వారికి పోలీసు కస్టడీకి పంపింది. ఈ కేసు వివరాలను ఎంహెచ్‌బీ పోలీసు స్టేషన్ అధికారి మీడియాకు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక ముంబైలోని గణపత్ పాటిల్ నగర్లో నివసిస్తోంది. తల్లి వదిలేయడంతో.. స్నేహితుడి సంరక్షణలో ఉంటోంది. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో తినడానికి ఏమైనా తెచ్చుకుందామని ఒక్కతే బయటకు వచ్చింది. తెలిసిన ఆటో డ్రైవర్ సోనుకాంబ్లే బాలికను దారిలో అడ్డగించాడు. ఆమెను బలవంతంగా లింక్ రోడ్డులో నిలిపి ఉంచిన టెంపోలోకి లాక్కెళ్లాడు. అనంతరం సోను స్నేహితులైన ఆటో డ్రైవర్లు జైప్రకాశ్పాల్, అస్లామ్ఖాన్ కూడా టెంపోలోకి ప్రవేశించి ముగ్గురూ కలిసి లైంగిక అకృత్యానికి పాల్పడ్డారు. ఇది గమనించిన ఒక వ్యక్తి కూడా టెంపోలోకి ప్రవేశించి బాలికపై అత్యాచారం చేశాడు. ఆమె అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకున్నారు. పారి పోబోతున్న జైప్రకాశ్ను పట్టుకుని గస్తీ పోలీసులకు అప్పగించారు. తనపై జైప్రకాశ్ సహా నలుగురు అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు వాం గ్మూలం ఇచ్చింది. కేసు నమోదు అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు సోమవారం రాత్రే సోను, అస్లాంను కూడా అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. పోలీసులు ముగ్గురినీ మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టగా, డిసెంబర్ 2 వరకు వారిని పోలీసు కస్టడీకి అప్పగించింది.