పరీక్షకు హాజరై తిరిగి వస్తుండగా... | 22 year old gang-raped, dumped at college gate near Jaipur's JLN Marg | Sakshi
Sakshi News home page

పరీక్షకు హాజరై తిరిగి వస్తుండగా...

Published Wed, Jan 11 2017 2:05 PM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

22 year old gang-raped, dumped at college gate near Jaipur's JLN Marg

జైపూర్‌: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో 22 ఏళ్ల యువతిపై సోమవారం సామూహిక  అత్యాచారం జరిగింది. ఆమె ఆల్వార్‌లో పరీక్షకు హాజరై తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుందని డీసీపీ అశోక్‌కుమార్‌ గుప్తా చెప్పారు. పరీక్ష పూర్తయిన తరువాత ఆమె జైపూర్‌ చేరుకుంది. అక్కడి రైల్వే స్టేషన్‌లో రాత్రి 7.45 గంటలకు నలుగురు నిందితులు బాధితురాలిని తమ వాహనంలో ఎక్కించుకుని, సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి రాత్రి 11.30 గంటలకు జన సంచారం లేని చోట వదిలేశారు.

బాధితురాలు మంగళవారం ఉదయం 5 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్తుతెలియని నిందితులపై కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నామని, బాధితురాలికి వైద్య పరీక్షలు జరిపించామని అశోక్‌ కుమార్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement