38 మంది సజీవ దహనం
బీజింగ్: చైనాలో ఓ విరామ ఆశ్రమంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. మధ్య చైనాలోని హెనాన్ ప్రావిన్స్లో సోమవారం రాత్రి 7.30 తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పింగ్ దింగ్ షాన్ అనే నగరంలోఓ ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భవనంలోని అపార్ట్ మెంట్లో కాంగ్లెయువాన్ అనే వృద్ధాశ్రమం ఉంది.
ఇందులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించి భారీగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక దళం చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించే సమయానికి దాదాపు 30 మందికి పైగా చనిపోయారు. మిగితావారు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.