బ్యాంకుకు రూ. 3.7 కోట్ల మేర టోపీ!! | 39 booked for cheating bank worth Rs 3.7 crores | Sakshi
Sakshi News home page

బ్యాంకుకు రూ. 3.7 కోట్ల మేర టోపీ!!

Published Thu, May 22 2014 1:06 PM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM

39 booked for cheating bank worth Rs 3.7 crores

ఫోర్జరీ పత్రాలతో వాహనాల కొనుగోళ్ల కోసం రుణాలు తీసుకుని బ్యాంకును రూ. 3.7 కోట్ల మేర మోసం చేసిన ఘరానా దొంగలను పోలీసులు గుర్తించారు. ఓ ఆటోమొబైల్ డీలర్ సహా మొత్తం 39 మందిపై కేసులు నమోదు చేశారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చీఫ్ మేనేజర్ ఎన్ఎ దుసానె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు.

2013 సెప్టెంబర్ నాటికి ఈ బ్యాంకు డోంబివిలి శాఖలో వాహన రుణాల బకాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏంటా అని చూస్తే, 2012లో సునీల్ మదాల్కర్ అనే వ్యక్తి కారు కొనుగోలు కోసం రూ. 14 లక్షల అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తం నేరుగా మౌళి ఆటోమోటివ్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. కానీ, రుణం కోసం బ్యాంకుకు వెళ్లినప్పుడు నకిలీ కొటేషన్లు, పత్రాలను సమర్పించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తే.. మదాల్కర్ వాహనం ఆర్టీవోలో రిజిస్టర్ కాలేదని తెలిసింది. ఎందుకంటే.. ఆయన అసలు కారే కొనలేదు. మౌళి ఆటోమోటివ్ యజమాని నితిన్ పి డోంగ్రేతో కలిసి బ్యాంకుకు టోపీ పెట్టాడు.

అది విజయవంతం కావడంతో, మరో 37 మంది కూడా అదే యజమాని సాయంతో బ్యాంకుకు మరింత పెద్ద టోపీ పెట్టారు. ఇదంతా కలిసి ఏకంగా రూ. 3.77 కోట్లకు చేరింది. దీంతో మొత్తం అందరిపైనా పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement