
వడగాల్పులకు 427 మంది మృతి
తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. వడగాల్పులకు ఇప్పటి వరకు మొత్తం 472 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 204 మంది.. తెలంగాణలో 230 మంది మరణించారు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 67 మంది మరణించారు. అలాగే ప్రకాశం జిల్లాలో 63 మంది చనిపోయారు. అయితే ఇప్పటి వరకు 46 మంది మాత్రమే విపత్తు శాఖ తన ప్రాధమిక నివేదికలో వెల్లడించింది. మృతుల కుటుంబాలకు ఆపద్భందు పథకం కింద రూ. 50 వేల ఆర్థిక సహాయం అందుతుందని అధికారులు వెల్లడించారు.