బిహార్‌లో నాలుగో దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఏడు జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది.
♦ 55 స్థానాల్లో పోలింగ్
♦ బరిలో 776 మంది అభ్యర్థులు
పట్నా: బిహార్‌లో నాలుగో దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఏడు జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ముజఫర్‌పూర్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, సీతామర్హి, షియోహర్, గోపాల్‌గంజ్, శివాన్ జిల్లాల్లో జరగనున్న ఎన్నికల్లో 776 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహాకూటమిలో ఆర్జేడీ 26 స్థానాల్లో, జేడీయూ 21, కాంగ్రెస్ 8 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి.
ఎన్డీఏ కూటమిలో బీజేపీ 42 స్థానాల్లో, ఎల్జేపీ 5, హిందుస్తానీ ఆవామ్ మంచ్ 4, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ 4 చోట్ల అభ్యర్థులను బరిలో దింపాయి. 1,46,93,294 మంది ఓటర్లు ఉండగా, 14,139 పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉన్నట్లు అదనపు ముఖ్య ఎన్నికల అధికారి ఆర్.లక్ష్మణన్ చెప్పారు.