ఫోర్బ్స్ సంపన్నుల్లోని భారతీయ అమెరికన్లు వీరే
న్యూయార్క్: ఫోర్బ్స్ విడుదల చేసిన 'ది రిచెస్ట్ పీపుల్ ఇన్ అమెరికా 2016' జాబితాలో ఐదుగురు భారతీయ అమెరికన్లు చోటు దక్కించుకున్నారు. మైక్రోసాఫ్ట్ సహయజమాని బిల్ గేట్స్ 81 బిలియన్ డాలర్ల సంపదతో వరుసగా 23వ ఏటా ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్ధానంలో నిలిచారు. మొత్తం 400మంది అమెరికా కుబేరుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది.
సింఫోని టెక్నాలజీ వ్యవస్ధాపకుడు రోమేశ్ వాద్వాని, సింటెల్ భారత్ ఔట్ సోర్సింగ్ కంపెనీ సహవ్యవస్ధాపకురాలు నీరజా దేశాయ్, ఎయిర్ లైన్స్ దిగ్గజం రాకేష్ గంగ్వాల్, జాన్ కపూర్, కవితాక్ రామ్ శ్రీరామ్ లు ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ఉన్నారు. 69 ఏళ్ల వాద్వాని మూడు బిలియన్ డాలర్లతో జాబితాలో 222వ స్ధానంలో నిలిచారు. 2.5బిలియన్ డాలర్లతో దేశాయ్ 274వ స్ధానంలో నిలవగా, గంగ్వాల్ 2.2బిలియన్ డాలర్లతో 321వ స్ధానంలో, 2.1 బిలియన్ డాలర్లతో కపూర్ 335వ స్ధానంలో, 1.9 బిలియన్ డాలర్ల సంపదతో శ్రీరామ్ 361వ స్ధానంలో నిలిచారు.