
అమెరికా కుబేరుల్లో ఐదుగురు ఇండియన్స్
మెల్బోర్న్: అమెరికా శ్రీమంతుల జాబితాలో ఐదుగురు ఇండియన్-అమెరికన్లు చోటు సంపాదించారు. ఎన్నారై వ్యాపారవేత్తలు భరత్ దేశాయ్, జాన్ కపూర్, రొమేష్ వద్వానీ, రామ్ శ్రీరామ్, వినోద్ ఖోస్లా ఈ జాబితాలో ఉన్నారు.
400 మంది అమెరికా కుబేరుల పేర్లతో ఫోర్బ్స్ రూపొందించిన 'ద రిచెస్ట్ట్ పీపుల్ ఇన్ అమెరికా 2014' జాబితాలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ 400 మంది అమెరికా కుబేరుల సంపద 2.29 ట్రిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ లెక్కగట్టింది. గతేడాది కంటే 270 బిలియన్ డాలర్లు సంపద పెరిగిందని వెల్లడించింది.