నిద్రలోనే ప్రాణాలు పోయాయి.. | 6 Killed In Their Sleep As Fire Breaks Out In Pune Bakery | Sakshi
Sakshi News home page

నిద్రలోనే ప్రాణాలు పోయాయి..

Published Fri, Dec 30 2016 10:13 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

నిద్రలోనే ప్రాణాలు  పోయాయి.. - Sakshi

నిద్రలోనే ప్రాణాలు పోయాయి..

పుణే: మహారాష్ట్ర లోఓ బేకరీ లో  భారీ  అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుఝామున చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఆరుగురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోవడం   తీవ్ర విషాదాన్ని  నింపింది.   పుణే లోని బేక్స్ అండ్ కేక్స్  లో  బేకరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్టుగా ప్రాథమికంగా  పోలీసులు  భావిస్తున్నారు.
   
బహుళ అంతస్తుల భవనంలో  మొదటి అంతస్తులో  ఉన్న బేకరీ ఈ ప్రమాదం సంభవించింది. అయితే మంటలు పెద్దగా వ్యాపించకపోయినప్పటికీ.. లోపల నిద్రిస్తున్న ఆరుగురు కార్మికులు  ప్రాణాలు   కోల్పోయారు.  .  బయట తాళం వేసి ఉండటంతో  బయటికి వచ్చేదారిలేకపోవడంతో  ఊపిరి ఆడక  చనిపో్యినట్టు  పోలీసులు తెలిపారు. అయితే తాళం ఎందుకు  వేశారనే కోణంలో విచారణ కొనసాగుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement