శ్రీశైల మహా క్షేత్రంలోని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు.
శ్రీశైలం(కర్నూలు): శ్రీశైల మహా క్షేత్రంలోని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం కావడంతో 80వేలకు పైగా భక్తులు శ్రీ స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ఉంటారని అంచనా. కాగా, రద్దీ రీత్యా పూజా వేళల్లో మార్పు చేశారు.
ఉదయం 3.30 గంటలకు మంగళ వాయిద్యాలు, 4 గంటలకు సుప్రభాతం, 5 గంటలకు మహామంగళ హారతి, 5.30 గంటల నుంచి దర్శన, ఆర్జితసేవలను ప్రారంభించారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన భక్తులకు దూర దర్శనం ఏర్పాటు చేశారు. 700 పైగా అభిషేకాలు నిర్వహించారు.