19 మంది మృతి దాడి అమెరికా చే సిందా?
కాబూల్: అఫ్ఘానిస్తాన్‌లోని కుందుజ్ నగరంలో శనివారం ఓ ఆస్పత్రిపై అమెరికా చేసినట్లు భావిస్తున్న వైమానిక దాడిలో 19 మంది మృతిచెందారు. వీరిలో 12 మంది వైద్యసిబ్బంది, ముగ్గురు పిల్లలు సహా ఏడుగురు రోగులు ఉన్నారు. 37 మంది గాయపడ్డారు. డాక్టర్స్ వితౌట్ బార్డర్(ఎంఎస్‌ఎఫ్) సంస్థకు చెందిన ఈ ఆస్పత్రిపై తెల్లవారుజామున దాడి జరిగిందని ఎంఎస్‌ఎఫ్ తెలిపింది.
దాడి గురించి అఫ్ఘాన్ ఆర్మీకి, వాషింగ్టన్‌లోని అమెరికా అధికారులకు సమాచారమిచ్చిన తర్వాత కూడా అరగంట బాంబులు పడ్డాయని పేర్కొంది. ఆస్పత్రి భవనం మంటల్లో చిక్కుకుపోయిందని, చాలా తీవ్రంగా దెబ్బతిందని తెలిపింది. కుందుజ్‌ను తాలిబాన్ కొన్ని రోజుల కింద చేజిక్కించుకోవడం తెలిసిందే. ఆ ఆస్పత్రిని మిలిటెంట్లు అప్ఘాన్ సైనికులపై, ప్రజలపై దాడి చేయడానికి స్థావరంగా వాడుకున్నారని ప్రభుత్వం తెలిపింది. తాలిబాన్ లక్ష్యంగా వేసిన బాంబుల్లో కొన్ని ఆస్పత్రిపైన పడి ఉండొచ్చని అమెరికా పేర్కొంది.
అఫ్ఘాన్ ఆస్పత్రిపై వైమానిక దాడి
Published Sun, Oct 4 2015 1:57 AM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM
Advertisement
Advertisement