అమెజాన్ సూపర్ ఆఫర్ | Amazon launches membership service Prime in India | Sakshi
Sakshi News home page

అమెజాన్ సూపర్ ఆఫర్

Published Tue, Jul 26 2016 11:45 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

అమెజాన్ సూపర్ ఆఫర్

అమెజాన్ సూపర్ ఆఫర్

ముంబై:  ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్  తన వినియెగదారులకోసం మరో  సౌకర్యాన్ని అందుబాటులోకి  తీసుకొచ్చింది.  ప్రైమ్ మెంబర్ షిప్  ప్రోగ్రాం ను మంగళవారం ప్రకటించింది. దేశంలో 100కు  పైగా నగరాల్లో తన సేవలు అందిస్తున్న అమెజాన్ ప్రధాన సభ్యత్వం కార్యక్రమాన్ని  ఆవిష్కరించింది. రూ 499 వార్షిక చందాతో దీన్ని యూజర్లకు పరిచయం చేస్తోంది. నిర్దేశిత రూ.999 ఫీజులో 60రోజుల ప్రారంభ ఫ్రీ ఆఫర్ తో పాటు,  రూ. 500 డిస్కౌంట్ ఇస్తోంది.  దీని ద్వారా  ఆర్డర్ చేసిన రెండు మూడురోజుల్లోనే ఆయా ఉత్పత్తులు వినియోగదారుల చెంత చేరనున్నాయి.  

అంతేకాదు  ప్రైమ్ సభ్యులకు అదనంగా  ప్రత్యేక  అవకాశాలు,స్పెషల్   డీల్స్ ను అందించనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. మినిమం కొనుగోలు నిబంధన లేకుండా .. ప్రైమ్  మెంబర్స్ అందరూ ఈ  అన్ లిమిటెడ్ ఫాస్ట్ ఫ్రీ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది.
ఇది తమ వ్యాపార వృద్ధికి మరింత తోడ్పాటు అందిస్తుందని  అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అన్ లిమిటెడ్  ఫ్రీ సర్వీసుతోపాటు  ప్రైమ్ డెలీవరీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు.  సభ్యత్వం పొందిన తమ  ప్రధాన సభ్యులు  20 నగరాల్లో  10,000 పైగా ఉత్పత్తులపై  రూ .50 పైగా రాయితీతో  అదే రోజు, ఉదయం లేదా షెడ్యూల్ డెలివరీని ఎంచుకోవచ్చని ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement