రైతు ఆత్మహత్యలపై అమితాబ్ ఆందోళన
దేశంలో అన్నదాతల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. చేతిలో రూ. 20 వేలు, రూ. 30 వేలు చేతిలో లేక.. రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల గురించి పట్టించుకోకపోతే.. మొత్తం సమాజమే ముప్పులో పడిపోతుందని ఆయన అన్నారు.