ఆదాయం పెరిగినా నష్టాలే!
సాక్షి, హైదరాబాద్: జూలైలో జరిగిన గోదావరి పుష్కరాల సందర్భంగా దాదాపు 30 లక్షల మంది భక్తుల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. అంతకుముందు నెల(జూన్)తో పోలిస్తే రూ.30 కోట్ల ఆదాయం పెరి గింది. కానీ, ఆర్టీసీ ఆర్థిక విభాగం లెక్కల ప్రకారం జూలైలో తెలంగాణ ఆర్టీసీకి సుమారు రూ.32 కోట్ల నష్టా లు వచ్చాయి. ఈ నివేదికను బుధవా రం జేఎండీ ముందుంచింది. ఇదీ కొత్త ఫిట్‌మెంట్ మహిమ. ప్రభుత్వం ప్రకటించిన 44 శాతం ఫిట్‌మెంట్ జూలై నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో రూ.21 కోట్లకుపైగా ఆర్టీసీపై అదనపు భారం పడింది. ఈ నేపథ్యంలో జేఎండీ రమణరావు గురువారం అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. ఖర్చుల నియంత్రణ, ఆదాయ పెంపుపై చర్చించనున్నారు.
అందని ప్రభుత్వ సాయం
బడ్జెట్ వేళ ఆర్టీసీకి ప్రతి ఏటా కొంతమొత్తం కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిట్‌మెంట్ ప్రకటన సమయంలో హామీ ఇచ్చారు. కానీ ఈలోపు కొంత సాయం అవసరమని, వేతనాల రూపంలో పెరిగిన భారాన్ని ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ చేయాలని అధికారులు కోరారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అదనంగా నయాపైసా సాయం అందలేదు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో ఆర్టీసీకి రూ.110 కోట్ల నష్టం వాటిల్లింది.
చార్జీల పెంపుపై దృష్టి?
టీఎస్‌ఆర్టీసీలో చార్జీలు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. గతంలోనే 10 నుంచి 15 శాతం మేర పెం చాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ప్రభుత్వం అంగీకరించలేదు. నష్టాల్లో ఉన్నందున చార్జీలు పెంచక తప్పదని మరోసారి ప్రభుత్వాన్ని కోరేందుకు అధికారులు సిద్ధమయ్యారు.