additional burden
-
Budget 2023: సెస్సులు, సర్‌చార్జీలు ఎత్తివేయాలి
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు అదనపు భారంగా ఉంటున్న సెస్సు, సర్‌చార్జీలను ఎత్తివేయాలని, ట్యాక్స్ పరిధిలోకి మరింత మందిని చేర్చాలని బడ్జెట్‌కు సంబంధించి థింక్ చేంజ్ ఫోరం (టీసీఎఫ్) కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. అలాగే, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రంగాలకు పన్నుల భారాన్ని తగ్గించాలని, ట్యాక్స్‌పేయర్లు నిబంధనలను పాటించేలా పర్యవేక్షణను మరింత మెరుగుపర్చాలని పేర్కొంది. ఆర్థిక వృద్ధి సాధనకు, అభివృద్ధి పనులపై ఇన్వెస్ట్ చేసేందుకు ప్రభుత్వం పన్ను ఆదాయాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని టీసీఎఫ్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు. అధిక పన్నుల భారం, సంక్లిష్టమైన ట్యాక్స్ విధానాలు మొదలైనవి వివాదాలకు దారి తీస్తున్నాయని, నిబంధనల అమలు సరిగ్గా లేకపోవడం వల్ల వసూళ్లపై ప్రభావం పడుతోందని వారు తెలిపారు. అక్రమ వ్యాపారాలను అరికట్టడానికి ప్రభుత్వ ఏజెన్సీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా పన్ను ఎగవేతదారులు మరింత వినూత్న వ్యూహాలతో స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు మాజీ చైర్మన్ పీసీ ఝా చెప్పారు. అత్యధిక నియంత్రణలు, పన్నులు ఉండే పరిశ్రమలైన పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాలిక్ పానీయాల రంగాల నుంచి ఖజానాకు రావాల్సిన రూ. 28,500 కోట్ల మేర ఆదాయానికి గండి పడుతోందని పేర్కొన్నారు. ఇలాంటివి అరికట్టేందుకు మరింత అధునాతన టెక్నాలజీని ఉపయోగించాలని, పోర్టుల్లో మరిన్ని స్కానర్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. -
ప్రాజెక్టుల్లో జాప్యంతో రూ.4.52 లక్షల కోట్ల భారం
న్యూఢిల్లీ: మౌలిక రంగ ప్రాజెక్టుల్లో జాప్యం వాటి నిర్మాణ వ్యయ అంచనాలను భారీగా పెంచేస్తోంది. రూ.150 కోట్లు, అంతకుమించి వ్యయంతో కూడిన మొత్తం 1,529 ప్రాజెక్టులకు గాను 384 ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల.. రూ.4.52 లక్షల కోట్ల అదనపు భారం పడనున్నట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ నివేదిక వెల్లడించింది. అలాగే, మొత్తం 662 ప్రాజెక్టులు ఆలస్యంగా సాగుతున్నట్టు పేర్కొంది. ‘‘1,529 ప్రాజెక్టుల వాస్తవ నిర్మాణ వ్యయం రూ.21,25,851 కోట్లు. కానీ, నిర్మాణం పూర్తయ్యే నాటికి వీటి వ్యయం రూ.25,78,197 కోట్లకు చేరనుంది. అంటే రూ.4,52,345 కోట్ల అదనపు వ్యయం కానుంది’’అని వివరించింది. 2022 సెప్టెంబర్ నాటికి ఈ ప్రాజెక్టులపై చేసిన వ్యయం రూ.13,78,142 కోట్లుగా ఉంది. 662 ప్రాజెక్టుల్లో 1–12 నెలల ఆలస్యంతో నడుస్తున్నవి 133 ఉన్నాయి. 124 ప్రాజెక్టులు 13–24 నెలలు, 276 ప్రాజెక్టులు 25–60 నెలలు, 129 ప్రాజెక్టులు వాస్తవ గడువుతో పోలిస్తే 61 నెలలకు మించి ఆలస్యంగా సాగుతున్నాయి. భూ సమీకరణ, అటవీ, పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టులకు కావాల్సిన రుణాల సమీకరణలో ఆలస్యం కారణాలుగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. -
బ్యాంకుల బాదుడు.. పెరుగుతున్న వడ్డీరేట్లు..
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు కీలక రెపో రేటు పెంపు తర్వాత బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు సైతం రుణ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ప్రైవేటురంగ గృహ రుణాల దిగ్గజం హెచ్డీఎఫ్సీ తన బెంచ్‌మార్క్ లెండింగ్ (రుణాలు) రేట్లను 30 బేసిస్ పాయింట్లు (0.30 శాతం) పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలపై ఈ మేరకు అదనపు భారం పడనుంది. ప్రభుత్వరంగ ఇండియన్ బ్యాంకు సైతం 0.40 శాతం రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. దీనికంటే ముందు ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయాలు ప్రకటించడాన్ని గమనించాలి. అనూహ్యంగా ఆర్బీఐ రెపో రేటును 0.40 శాతం పెంచుతున్నట్టు గత వారం ప్రకటించడం తెలిసిందే. అలాగే, సీఆర్ఆర్ను 0.50 శాతం పెంచింది. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్)ను గృహ రుణాలపై 30 బేసిస్ పాయింట్లు పెంచినట్టు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. కొత్తగా రుణాలు తీసుకునే వారికి 7% నుంచి 7.45 శాతం మధ్య రేట్లను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి 0.30 శాతం పెంపు అమలవుతుందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. ప్రస్తుతం గృహ రుణాలపై ఈ సంస్థ 6.70–7.15% మధ్య రేట్లను అమలు చేస్తోంది. హెచ్డీఎఫ్సీ తన రుణాలకు మూడు నెలల సైకిల్‌ను అమలు చేస్తుంటుంది. అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి రుణాలపై రేట్లు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సవరణకు గురవుతుంటాయి. ఇండియన్ బ్యాంకు పెంపుబాట.. ఇండియన్ బ్యాంకు రెపో అనుసంధానిత లెండింగ్ రేటును 0.40 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ నెల 9 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. రెపో రుణాల రేట్లు ఆర్బీఐ రెపో రేటును సవరించిన ప్రతిసారీ మార్పునకు లోనవుతాయి. ‘‘బ్యాంకు అస్సెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ కమిటీ రెపో రేటుకు లింక్ అయిన అన్ని రుణాల రేట్లను సమీక్షించింది. రెపో రేటును 4 శాతం నుంచి 4.40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది’’అని ఇండియన్ బ్యాంకు ప్రకటన విడుదల చేసింది. -
జీఎస్టీతో ప్రభుత్వ పనులపై భారం
⇒ లోక్‌సభలో టీఆర్ఎస్ ఆందోళన ⇒ జీఎస్టీ కౌన్సిల్‌కు వివరిస్తానన్న కేంద్ర ఆర్థిక మంత్రి సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ అమలు కారణంగా ప్రభుత్వ అభివృద్ధి పనులపై భారం పడుతోం దని టీఆర్ఎస్ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ అంశంపై శుక్రవారం లోక్‌సభలో వాయిదా తీర్మానానికి టీఆర్ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డి నోటీసు ఇవ్వగా సభాపతి సుమిత్రా మహాజన్ దానిని తిరస్కరించారు. టీఆర్ఎస్ ఎంపీలం దరి విజ్ఞప్తి మేరకు జితేందర్‌రెడ్డికి ఈ అంశంపై మాట్లాడేందుకు సభాపతి అవకాశం ఇచ్చారు. జితేందర్‌రెడ్డి దీనిపై ఆందోళన వ్యక్తంచేశారు. ‘ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలు, పథకాలపై జీఎస్టీ అమలు చేయరాదు. ఈ పథకాలన్నింటికీ పాత పన్ను పద్ధతిలో బడ్జెట్ కేటాయింపులు జరిపాం. 18% జీఎస్టీ అమలు చేసే రూ.19,200 కోట్ల అదనపు భారం రాష్ట్రంపై పడుతుంది. జీఎస్టీ కౌన్సిల్లో పలుమార్లు దీనిని లేవనెత్తాం. 5% పన్ను నుంచి 18% జీఎస్టీకి తీసుకెళితే భరించలేం’ అని పేర్కొన్నారు. దీనికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇస్తూ ఈ అంశాన్నీ జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. అరుణ్ జైట్లీతో కేటీఆర్ భేటీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ప్రభుత్వ పథకాలపై జీఎస్టీ అమలుతో అవి ప్రభావితమవుతు న్నాయని తెలిపారు. తెలంగాణలో ఇప్ప టికే అమలులో ఉన్న పలు ప్రతిష్టాత్మక పథ కాల పురోగతి దెబ్బతినకుండా కేంద్రం, జీఎస్టీ కౌన్సిల్ త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
241 ఇన్ఫ్రా ప్రాజెక్టులపై 1.5 లక్షల కోట్లు అదనపు భారం
న్యూఢిల్లీ: దేశంలోని దాదాపు 241 ఇన్ఫ్రా ప్రాజెక్టులపై రూ.1.55 లక్షల కోట్ల అదనపు భారం పడింది. భూ సేకరణ, పర్యావరణ అనుమతుల జాప్యం సహా తదితర కారణాల వల్ల నిలిచిపోయిన ప్రాజెక్టులు కూడా వీటిల్లోనే ఉన్నాయి. కేంద్ర గణాంకాల.. శాఖ రైల్వే, విద్యుత్, రహదారులు వంటి పలు రంగాల్లోని దాదాపుగా 1,076 ఇన్ఫ్రా ప్రాజెక్టులను పరిశీలనలో ఉంచింది. వీటిల్లో 6 ప్రాజెక్టుల నిర్మాణం నిర్దేశిత సమయం కన్నా ముందుగానే జరుగుతోంది. 8 ప్రాజెక్టుల నిర్మాణం అనుకున్నట్టుగానే జరుగుతోంది. 343 ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి. 241 ప్రాజెక్టులకు నిర్మాణ వ్యయం బాగా పెరిగింది. -
ఆదాయం పెరిగినా నష్టాలే!
సాక్షి, హైదరాబాద్: జూలైలో జరిగిన గోదావరి పుష్కరాల సందర్భంగా దాదాపు 30 లక్షల మంది భక్తుల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. అంతకుముందు నెల(జూన్)తో పోలిస్తే రూ.30 కోట్ల ఆదాయం పెరి గింది. కానీ, ఆర్టీసీ ఆర్థిక విభాగం లెక్కల ప్రకారం జూలైలో తెలంగాణ ఆర్టీసీకి సుమారు రూ.32 కోట్ల నష్టా లు వచ్చాయి. ఈ నివేదికను బుధవా రం జేఎండీ ముందుంచింది. ఇదీ కొత్త ఫిట్మెంట్ మహిమ. ప్రభుత్వం ప్రకటించిన 44 శాతం ఫిట్మెంట్ జూలై నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో రూ.21 కోట్లకుపైగా ఆర్టీసీపై అదనపు భారం పడింది. ఈ నేపథ్యంలో జేఎండీ రమణరావు గురువారం అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. ఖర్చుల నియంత్రణ, ఆదాయ పెంపుపై చర్చించనున్నారు. అందని ప్రభుత్వ సాయం బడ్జెట్ వేళ ఆర్టీసీకి ప్రతి ఏటా కొంతమొత్తం కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిట్మెంట్ ప్రకటన సమయంలో హామీ ఇచ్చారు. కానీ ఈలోపు కొంత సాయం అవసరమని, వేతనాల రూపంలో పెరిగిన భారాన్ని ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేయాలని అధికారులు కోరారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అదనంగా నయాపైసా సాయం అందలేదు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో ఆర్టీసీకి రూ.110 కోట్ల నష్టం వాటిల్లింది. చార్జీల పెంపుపై దృష్టి? టీఎస్ఆర్టీసీలో చార్జీలు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. గతంలోనే 10 నుంచి 15 శాతం మేర పెం చాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ప్రభుత్వం అంగీకరించలేదు. నష్టాల్లో ఉన్నందున చార్జీలు పెంచక తప్పదని మరోసారి ప్రభుత్వాన్ని కోరేందుకు అధికారులు సిద్ధమయ్యారు. -
సీఎస్టీపై సమరభేరి!
- విభజనతో ఆంధ్రప్రదేశ్ వ్యాపారులపై అదనపు భారం - తెలంగాణ నుంచి వచ్చే సరుకులపై పన్ను విధిస్తున్న కేంద్రం - రద్దు చేయకపోతే ఉద్యమమే శరణ్యమంటున్న వర్తకులు సాక్షి, రాజమండ్రి : రాష్ట్రం విడిపోయాక ట్యాక్స్ హాలిడే ఇస్తామన్న కేంద్రం.. ఆ మాటకు విరుద్ధంగా వ్యాపారులపై అదనపు పన్నుభారాన్ని మోపుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రవా ణా అయ్యే సరుకులపై సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ (సీఎస్టీ) విధిస్తోంది. తమ పాలిట గుదిబండగా మారిన ఈ పన్ను ఎత్తివేయాలంటూ వ్యాపారులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. కొన్ని వస్తువులు హైదరాబాద్‌లో తప్ప మరొక చోట లభ్యం కానందున రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పటి నుంచీ ఆ నగరం నుంచి తెచ్చి, విక్రయించడానికే అన్ని జిల్లాల వ్యాపారులూ అలవాటు పడ్డారు. అయితే విభజనతో.. అక్కడి నుంచి వచ్చే సరుకులపై కూడా సీఎస్టీ విధిస్తుండడంతో వ్యాపారులపై భారం పడుతోంది. అలాగే నిత్యావసరాల్లో వరియేతర ఆహార ధాన్యాలనూ ఎక్కువగా తెలంగాణ జిల్లాల నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. ప్రధానంగా గోధుమ ఆధారిత ఆహార ఉత్పత్తులు పిండి, బిస్కట్లు తదితర వస్తువులు నెలకు సుమారు 1500 టన్నులు దిగుమతవుతాయని అంచనా. అంతేకాక వస్త్రాల మిల్లుల్లోనే ఎక్కువ భాగం హైదరాబాద్ పరిసరాల్లో విస్తరించాయి. పూణే నుంచి రెడీమేడ్ వస్త్రాలు డిజైన్ చేయించి హైదరాబాద్‌లో హోల్‌సేల్ వ్యాపారులకు అందిస్తారు. గతంలో చెన్నైపై ఆధారపడ్డ వ్యాపారులు పదేళ్లుగా హైదరాబాద్‌ను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ అల్లుకున్న అవసరాలు కంప్యూటర్ స్పేర్ పార్టులు, ఇతర ఉపకరణాలను ఇక్కడి వ్యాపారులు పూర్తిగా హైదరాబాద్ నుంచే తీసుకు వస్తున్నారు. ఎలక్రికల్ వస్తువులు, భవన నిర్మాణ సామగ్రి.. ఇలా అనేక అవసరాలకు సంబంధించిన ప్రధాన వస్తువులకు చాలా ఏళ్ల నుంచి హైదరాబాద్ కేంద్రంగా మారిపోయింది. ఇప్పుడు తెలంగాణ నుంచి ఉభయగోదావరి జిల్లాలకు ఈ వస్తువులు చేరుకోవాలంటే సీఎస్టీ రూపేణా రెండు శాతం అదనంగా పన్ను చెల్లించాల్సిందే. పంచదార, మైదా, ఇతర తిను బండారాలపై సీఎస్టీ చెల్లించి జిల్లాకు చేర్చగానే వాటిపై ఐదు శాతం వ్యాట్ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. కేంద్రం ట్యాక్స్ హాలిడే అమలు చేయాలని, సీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే గతంలో వస్త్రాలపై వ్యాట్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి వేదికైన మాదిరిగానే ఇప్పుడు సీఎస్టీ రద్దుకు కూడా తూర్పుగోదావరి జిల్లా వేదికగా ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి, చర్చించుకుంటున్నారు. సీఎస్టీ రద్దుకు ఉత్తర్వులివ్వాలి.. సీఎస్టీని ఎత్తివేస్తూ కేంద్రం స్పష్టంగా ఉత్తర్వులు ఇవ్వాలి. విభజనతో సీమాంధ్రకు తీరని అన్యాయం జరిగింది. వ్యాపారులు నిలదొక్కుకోవాలంటే పన్నుల మినహాయింపు తప్పనిసరి. తెలంగాణ నుంచి సరుకు జిల్లాల్లోకి చేరాలంటే చెక్‌పోస్టుల వద్ద ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. వీటిని తొలగించడంతో పాటు పన్ను రాయితీ కూడా ప్రకటించేలా బీజేపీ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. - అశోక్‌కుమార్ జైన్, అధ్యక్షులు, ది రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ మనది అనుకునే హైదరాబాద్‌పై ఆధారపడ్డాం.. రెడీమేడ్ వస్త్రాలకు ఇప్పుడు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారింది. ఉమ్మడిగా ఉన్న కాలంలో అంతా హైదరాబాద్ అనే భావనతో అభివృద్ధి చేశారు. ఇతర రాష్ట్రాలను వదిలి అంతా హైదరాబాద్‌ను కొనుగోళ్లకు కేంద్రంగా మార్చుకున్నాం. ఇప్పుడు విడిపోయాక మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. అందుకు కొత్త రాష్ట్రాల మధ్యన కొంత కాలం సీఎస్టీ ఎత్తివేయాలి. - పోకల సీతయ్య, ఏపీ టెక్స్టైల్స్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ -
పట్టణ ఆస్తి పన్నుపై అదనపు బాదుడు
సాక్షి, హైదరాబాద్: మౌలిక సౌకర్యాలు పెంపు పేరుతో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ప్రజలపై అదనపు ఆస్తి పన్ను వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సమీర్‌శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక సౌకర్యాలు కల్పన, పెంపునకు 2015-20 సంవత్సరాల కాలంలో రూ. 46,695 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఇందులో కొంత 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నుంచి వస్తాయని, మిగతా నిధులను ఆంధ్రప్రదేశ్ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించారు. ఆ రుణం చెల్లింపు పూర్తయ్యే వరకు పట్టణ స్థానిక సంస్థల్లోని ప్రజలపై సాధారణ ఆస్తి పన్నుకు అదనంగా సప్లమెంటరీ ఆస్తి పన్నును వసూలు చేయనున్నారు. తాగునీరు, భూగర్భడ్రైనేజి, వరద కాలువలు, డ్రయిన్లు, నీటి వనరులు, పార్కులు, రోడ్లు వగైరా మెరుగుపరుస్తారు. రుణం తీరిన తరువాత అదనపు పన్ను వసూలును నిలుపుదల చేస్తారు.