241 ఇన్ఫ్రా ప్రాజెక్టులపై 1.5 లక్షల కోట్లు అదనపు భారం
న్యూఢిల్లీ: దేశంలోని దాదాపు 241 ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై రూ.1.55 లక్షల కోట్ల అదనపు భారం పడింది. భూ సేకరణ, పర్యావరణ అనుమతుల జాప్యం సహా తదితర కారణాల వల్ల నిలిచిపోయిన ప్రాజెక్టులు కూడా వీటిల్లోనే ఉన్నాయి. కేంద్ర గణాంకాల.. శాఖ రైల్వే, విద్యుత్, రహదారులు వంటి పలు రంగాల్లోని దాదాపుగా 1,076 ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను పరిశీలనలో ఉంచింది. వీటిల్లో 6 ప్రాజెక్టుల నిర్మాణం నిర్దేశిత సమయం కన్నా ముందుగానే జరుగుతోంది. 8 ప్రాజెక్టుల నిర్మాణం అనుకున్నట్టుగానే జరుగుతోంది. 343 ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి. 241 ప్రాజెక్టులకు నిర్మాణ వ్యయం బాగా పెరిగింది.