రాలేగావ్లో అన్నా హజారే ఆమరణ దీక్ష | Anna Hazare begins do-or-die fast for Jan Lokpal Bill | Sakshi
Sakshi News home page

రాలేగావ్లో అన్నా హజారే ఆమరణ దీక్ష

Published Tue, Dec 10 2013 11:27 AM | Last Updated on Fri, Sep 28 2018 7:57 PM

రాలేగావ్లో అన్నా హజారే ఆమరణ దీక్ష - Sakshi

రాలేగావ్లో అన్నా హజారే ఆమరణ దీక్ష

రాలేగావ్ : జన్లోక్పాల్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆమరణ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయన స్వగ్రామమైన అహ్మద్‌నగర్ జిల్లాలోని రాలేగావ్ సిద్ధి గ్రామంలో మంగళవారం ఉదయం దీక్షకు దిగారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే లోక్బిల్లును ఆమోదించాలని హజారే డిమాండ్ చేశారు.

లోక్‌పాల్ బిల్లుపై గతంలో సోనియాగాంధీ ఇచ్చిన హామీ వల్లే తాను దీక్ష విరమించానని అన్నా హజారే తెలిపారు. అయితే జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెడతామని చెప్పిన కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వం మోసం చేశాయని హజారే ధ్వజమెత్తారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనట్లయితే 2014లో జరగనున్న లోకసభ ఎన్నికల్లో కూడా తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement