
కమలనాథన్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీని రెండు రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీని రెండు రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. ఈ కమిటీకి సూచనలు, అభ్యంతరాలు ఇవ్వడానికి రేపే తుది గడువు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు మార్గదర్శకాలపై తమ అభ్యంతరాలను తెలియజేస్తూ కమలనాథ్కు ఓ లేఖ సమర్పించారు.
ఏపి ఉద్యోగ సంఘాల నేతలు కూడా కమలనాథన్‌ను ఈరోజు కలిసి 18 హక్కు క్లాజ్‌ను తొలగించాలని కోరారు. భార్యాభర్తల ఉద్యోగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు దంపతుల ఆప్షన్‌ను కోరారు. ఎల్‌టీసీలోని హోమ్‌టౌన్ ఆప్షన్‌ను కూడా తొలగించాలని విజ్ఞప్తి చేశారు.