చదువుకోరు.. శుభ్రంగా ఉండరు
ఇప్పటికి 70 ఏళ్లు దాటినా వారిలో ఎటువంటి మార్పు రాలేదు. దళితులు అభివృద్ధి చెందకపోవడానికి దళితులే కారణం. వారికి భూముల పట్టాలు ఉండవు. వారు బాగా చదువుకోరు. శుభ్రంగా ఉండరు. అందుకే వారే ఎక్కువగా రోగాల బారిన పడుతు న్నారు’ అన్నారు. నంద్యాల ఉపఎన్నిక పూర్తి కాగానే ఈ ఆసుపత్రి చైర్మన్‌గా తన కుమారుడు సుధీర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. తాను సంకల్పించిన పనిని పట్టుబట్టి కచ్చితంగా జరిగేలా చూస్తానని, ఆ పని జరుగకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. ‘విలేకరులు ఉన్నది ఉన్నట్లు రాయాలి. లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు మయసభ మాదిరిగా రాయకూడదు. చిన్న వాటిని భూతద్దంలో చూపించడం సరైంది కాదు’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.