అపురూప ‘కలాం’ | APJ Abdul Kalam Statue of fiber | Sakshi
Sakshi News home page

అపురూప ‘కలాం’

Published Tue, Aug 11 2015 2:36 AM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM

అపురూప ‘కలాం’ - Sakshi

అపురూప ‘కలాం’

విఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నిలువెత్తు ఫైబర్ విగ్రహం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ శిల్పశాలలో రూపుదిద్దుకుంది. కలాం కాంస్య, ఫైబర్ విగ్రహాల తయారీకి రాష్ట్రం నుంచే కాక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయని రాజ్‌కుమార్ సోమవారం విలేకరులకు తెలిపారు. గుంటూరు జిల్లా కనపర్తి ఎంఐసీఈ స్కూల్ ఆవరణలో నెలకొల్పేందుకు ఆ స్కూల్ యాజమాన్యం ఆర్డర్ మేరకు రూపొందించిన నిలువెత్తు ఫైబర్ విగ్రహాన్ని ఈ నెల 15న ఆవిష్కరించనున్నారని తెలిపారు.

ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా కలాం జయంతికి రెండు ప్రభుత్వ విద్యాసంస్థలకు ఆయన బస్ట్ సైజ్ విగ్రహాలు బహూకరించనున్నట్టు రాజ్‌కుమార్ తెలిపారు. ఈ ఏడాది కొత్తపేట, రాజమండ్రి కళాశాలలకు అందచేయనున్నట్టు తెలిపారు.     - కొత్తపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement