రోచిస్టర్ మెడికల్ సెంటర్‌తో అపోలో ఎంవోయూ
రోచిస్టర్ మెడికల్ సెంటర్‌తో అపోలో ఎంవోయూ
Published Wed, Aug 28 2013 2:12 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM
హైదరాబాద్, న్యూస్‌లైన్: అపోలో 150 పడకల ఆసుపత్రి నుంచి అద్భుతమైన హెల్త్‌సిటీగా ఎదిగిందని అపోలో గ్రూపు హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ. రెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడ అపోలో ఆసుపత్రిలో రోచిస్టర్ మెడికల్ సెంటర్ (అమెరికా)తో అపోలో ఆసుపత్రి ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
హెల్తీ స్కూల్స్ కార్యక్రమం...
క్షతగాత్రులకు అత్యవసర సేవలు అందించే హెల్తీ స్కూల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఆసుపత్రి సేవలలో ఇది ముఖ్యమైన ఘట్టమని చెప్పారు. ప్రమాదాలలో గాయపడిన విద్యార్థులకూ, వారి కుటుంబ సభ్యులకూ ఈ హెల్తీ స్కూల్ ప్రోగ్రామ్ మంచి సేవలు అందిస్తుందని చెప్పారు. దీనిలో భాగంగా స్కూల్ విద్యార్థులకు ఆరోగ్య చెక్‌అప్, రోడ్డు ప్రమాదాలలో గాయపడితే రూ.50వేలదాకా ఉచిత చికిత్స అందించడం హెల్తీ స్కూల్ ముఖ్య ఉద్దేశమన్నారు.కార్యక్రమంలో అపోలో ఆసుపత్రి ఈడీ సంగీతారెడ్డి, యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ సీవోవో పీటర్ రాబిన్‌సన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement