ఆర్ యూ సీరియస్?
బెంగళూరు: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పునరాగమనంపై బీజేపీ నాయకుడు షాహనాజ్ హుస్సేన్ వ్యంగ్యంగా స్పందించారు. రాహుల్ త్వరలోనే తిరిగొస్తారని వస్తున్న వార్తలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... ఇదంతా నిజమేనంటారా(ఆర్ యూ సీరియస్) అంటూ ప్రశ్నించారు.
సెలవుపై వెళ్లిన రాహుల్ గాంధీ ఈ నెల 19న తిరిగొస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే రాహుల్ పునరాగమనంపై వస్తున్న వార్తల్లో నిజమెంతో తమకు తెలియదని షాహనాజ్ హుస్సేన్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధులెవ్వరూ ప్రకటన చేయలేదు. 'రాహుల్ ఏ విమానంలో వస్తారు. వచ్చిన తర్వాత ఎవరినీ కలుస్తారు. రాహుల్ సెలవు పూర్తైన తర్వాతే వీటికి జవాబు దొరకుతుంది' అని హుస్సేన్ అన్నారు.