ఆలేరు-బీబీనగర్-యాదిగిరిగుట్ట: అర్హులైన కళాకారులందరికీ పింఛన్లు ఇవ్వటం లేదని, అధికార పార్టీ కార్యకర్తలకే దక్కుతున్నాయని ఆరోపిస్తూ యాదగిరిగుట్టలో తలపెట్టిన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. దగాపడ్డ కళాకారుల దుఃఖ ధూంధాం పేరిట మంగళవారం తలపెట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆందోళన చేపట్టిన టీడీపీ నేతలను కూడా అదుపులోకి తీసుకుని, వివిధ స్టేషన్లకు తరలించారు.
అరెస్టయిన వారిలో కార్యక్రమ నిర్వాహకులు దరువు అంజన్న, జంగు ప్రహ్లాద, జనగళం రామలింగం, నేర్నాల కిశోర్ తదితరులతోపాటు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి ఉన్నారు. కాగా, శోభారాణిని బీబీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమెకు సంఘీభావం తెలిపేందుకు ఆ పార్టీనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అక్కడికి వెళ్లనున్నట్లు సమాచారం.
కళాకారుల ధూంధాం భగ్నం: పలువురి అరెస్ట్
Published Tue, Aug 11 2015 7:16 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement