కేంద్ర హోంమంత్రితో కేజ్రీవాల్ భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు, లెప్టినెంట్ గవర్నర్ జనరల్ నజీజంగ్ ఆధిపత్య పోరు నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
లెప్టినెంట్ గవర్నర్ ను పావుగా వాడుకుని తమ ప్రభుత్వంలో కేంద్రం జోక్యం చేసుకుంటోందని కేజ్రీవాల్ అంతకుముందు ఆరోపించారు. తమ ప్రభుత్వ వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దని కేంద్ర హోం శాఖకు ఘాటుగా లేఖ కూడా రాశారు.