చట్టసభల్లో నియమావళి అవసరం | Assembly is required in the code of conduct | Sakshi
Sakshi News home page

చట్టసభల్లో నియమావళి అవసరం

Published Wed, Sep 30 2015 1:17 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

చట్టసభల్లో నియమావళి అవసరం - Sakshi

చట్టసభల్లో నియమావళి అవసరం

- కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్య
- విశాఖలో అఖిల భారత విప్‌ల సదస్సు ప్రారంభం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలో చట్టసభలు, సభ్యుల విశ్వసనీయత సంక్షోభంలో చిక్కుకుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చట్టసభల సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రవర్తనా నియామావళి రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు విభేదాలకంటే జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తేనే దేశ ప్రగతి సాధ్యమని చెప్పారు. 17వ అఖిల భారత విప్‌ల రెండురోజుల సదస్సును విశాఖపట్నంలో మంగళవారం ఆయన ప్రారంభించారు.
 
నిర్మాణాత్మక పాత్ర పోషించాలి..
ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలిచేలా మన చట్టసభలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. చట్టసభల సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైన రాజకీయ వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత విప్‌ల మీద ఉందన్నారు. అఖిలపక్ష కమిటీలను ఏర్పాటు చేసే ప్రతిపాదనపై విప్‌ల సదస్సు చర్చించి తగిన సూచనలు ఇవ్వాలని చెప్పారు. సభ్యుల స్వీయ క్రమశిక్షణే అన్నింటికంటే ఉత్తమమైందన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల జీతభత్యాలు హేతుబద్ధంగా పెంచే విషయంపై చర్చించి సిఫార్సులు చేయాలన్నారు. ‘నో వర్క్.. నో పే’ పేరిట నెటిజన్లు ప్రతిపాదిస్తున్న అంశంపైనా చర్చించాలని ఆయన చెప్పారు.
 
సమన్వయలోపమే సమస్య..: చంద్రబాబు
అన్ని పార్టీలకూ అజెండాలు ఉన్నప్పటికీ అందరి అంతిమ లక్ష్యం దేశ ప్రయోజనాలే కావాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చట్టసభల్లో సభ్యుల మధ్య సమన్వయలోపం ప్రజాస్వామ్య వ్యవస్థకు పెద్ద సవాలుగా మారిందన్నారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ చట్టసభల సక్రమ నిర్వహణకు సభ్యులకు ప్రవర్తనా నియామవళి, సభాధ్యక్షుల విసృ్తత అధికారాల మీద చర్చించాలన్నారు. ఈ సమావేశాల్లో పార్లమెంటరీ కార్యదర్శి అజ్మల్ అమానుల్లా, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణలతోపాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రులు, చీఫ్ విప్‌లు, వివిధ పార్టీల విప్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement