హస్తం గూటికి వాజ్పేయి మేనకోడలు | Atal Bihari Vajpayee’s niece set to join Congress today | Sakshi
Sakshi News home page

హస్తం గూటికి వాజ్పేయి మేనకోడలు

Published Thu, Feb 27 2014 9:45 AM | Last Updated on Thu, Mar 28 2019 8:40 PM

హస్తం గూటికి వాజ్పేయి మేనకోడలు - Sakshi

హస్తం గూటికి వాజ్పేయి మేనకోడలు

భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి మేనకోడలు, మాజీ లోక్ సభ సభ్యురాలు కరుణా శుక్లా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. గురువారం ఆమె యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. శుక్ల బుధవారం యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. శుక్ల పార్టీలో చేరేందుకు సోనియా సుముఖత వ్యక్తం చేశారు.

 

గతంలో బీజేపీలో శుక్లా జాతీయ స్థాయిలో పలు కీలక పదవులు నిర్వహించారు. తదానంతరం పార్టీలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు పార్టీ వ్యవహారాలలో దూరంగా ఉంచుతున్నారని శుక్ల భావించారు. దాంతో గతేడాది ఛత్తీస్గఢ్ ఎన్నికల ముందు శుక్ల బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement