'పాక్ ప్రమేయానికి సంబంధించి ఏమీ మాట్లాడను' | Attacks aimed at derailing Indo-Pak talks: Jammu Kashmir chief minister Omar Abdullah | Sakshi
Sakshi News home page

'పాక్ ప్రమేయానికి సంబంధించి ఏమీ మాట్లాడను'

Published Thu, Sep 26 2013 1:26 PM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM

'పాక్ ప్రమేయానికి సంబంధించి ఏమీ మాట్లాడను'

'పాక్ ప్రమేయానికి సంబంధించి ఏమీ మాట్లాడను'

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన దాడుల విషయంలో పాకిస్తాన్ ప్రమేయానికి సంబంధించిన తానేమి మాట్లాడలేనని జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. భారత్‌-పాకిస్థాన్‌ మైత్రీ బంధాన్ని అడ్డుకునే దుష్టశక్తులు గతంలో కూడా చర్చల సమయంలో ఇలాంటి దాడులు చేశాయని గుర్తు చేశారు.  జరిగిన దాడుల్ని ఒమర్‌ ఖండించారు.

జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన తీవ్రవాదుల దాడిలో ఓ ఆర్మీ అధికారి సహా మొత్తం 12 మంది మరణించారు. ఈనెల 29 వ తేదీన ప్రధాని మన్మోహన్ సింగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య న్యూయార్క్లో సమావేశం జరగనున్న నేపథ్యంలో కూడా.. ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు తెగబడటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement