అరబిందో అనుబంధ కంపెనీ ఎరిస్ ఫార్మా చేతికి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా.. అనుబంధ కంపెనీ అయిన అరబిందో ఫార్మా (ఆస్ట్రేలియా) ప్రొప్రైటరీ లిమిటెడ్‌లో ఉన్న మొత్తం వాటాను ఎరిస్ ఫార్మా ఆస్ట్రేలియాకు విక్రయించింది. ఎంత మొత్తానికి ఈ డీల్ కుదిరిందీ వెల్లడించలేదు. అనుబంధ కంపెనీ ఎటువంటి లాభాలను అరబిందోకు అందించడం లేదు.
ఎస్, ఈయూతోపాటు అభివృద్ధి చెందుతున్న ముఖ్యమైన దేశాలవైపు దృష్టిసారించేందుకే వ్యూహాత్మకంగా వాటా విక్రయించినట్టు కంపెనీ తెలిపింది. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మార్కెట్లకై ఎరిస్ కోసం ఔషధాల తయారీ, సరఫరాను కొన్నేళ్లపాటు అరబిందో కొనసాగిస్తుంది.