Eris Pharma
-
ఈరిస్కు.. రెడ్డీస్ డెర్మటాలజీ బ్రాండ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగంలో ఉన్న ఈరిస్ లైఫ్‌సైన్సెస్ తాజాగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నుంచి తొమ్మిది రకాల డెర్మటాలజీ బ్రాండ్స్‌ను దక్కించుకుంది. డీల్ విలువ రూ.275 కోట్లు. చర్మ వ్యాధుల సంబంధ ఔషధ రంగంలో డీల్ తదనంతరం ఈరిస్ 7 శాతం వాటాతో మార్కె ట్లో మూడవ స్థానానికి ఎగబాకనుంది. 2022 మే నెలలో రూ.650 కోట్లతో ఓక్నెట్ హెల్త్‌కేర్‌ను చేజిక్కించుకోవడం ద్వారా డెర్మటాలజీ విభాగంలోకి ఈరిస్ ప్రవేశించింది. 2023 జనవరిలో గ్లెన్‌మార్క్ నుంచి తొమ్మిది డెర్మటాలజీ బ్రాండ్స్‌ను రూ.340 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. చర్మ వ్యాధుల సంబంధ ఔషధ విభాగాన్ని పటిష్టం చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొనుగోళ్లకు రూ.1,265 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. -
అరబిందో అనుబంధ కంపెనీ ఎరిస్ ఫార్మా చేతికి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా.. అనుబంధ కంపెనీ అయిన అరబిందో ఫార్మా (ఆస్ట్రేలియా) ప్రొప్రైటరీ లిమిటెడ్‌లో ఉన్న మొత్తం వాటాను ఎరిస్ ఫార్మా ఆస్ట్రేలియాకు విక్రయించింది. ఎంత మొత్తానికి ఈ డీల్ కుదిరిందీ వెల్లడించలేదు. అనుబంధ కంపెనీ ఎటువంటి లాభాలను అరబిందోకు అందించడం లేదు. ఎస్, ఈయూతోపాటు అభివృద్ధి చెందుతున్న ముఖ్యమైన దేశాలవైపు దృష్టిసారించేందుకే వ్యూహాత్మకంగా వాటా విక్రయించినట్టు కంపెనీ తెలిపింది. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మార్కెట్లకై ఎరిస్ కోసం ఔషధాల తయారీ, సరఫరాను కొన్నేళ్లపాటు అరబిందో కొనసాగిస్తుంది.