'ఆ విమానం' గాలింపు నిలిపివేస్తాం ! | Australia-led MH370 search to be called off in 2016 | Sakshi
Sakshi News home page

'ఆ విమాన' గాలింపు నిలిపివేస్తాం !

Published Thu, Jun 4 2015 10:55 AM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

'ఆ విమానం' గాలింపు నిలిపివేస్తాం !

'ఆ విమానం' గాలింపు నిలిపివేస్తాం !

సిడ్నీ: 239 మంది ప్రయాణికులు... విమాన సిబ్బందితో మలేసియా నుంచి బయలుదేరిన ఎమ్హెచ్ 370 విమానం అదృశ్యం మిస్టరీ ఛేదించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి రావడం లేదు. దీంతో విమాన ఆచూకీ ప్రయత్నాలు విరమించే యోచనలో ఉన్నట్లు ఆస్ట్రేలియాలోని జాయింట్ ఏజెన్సీ కో ఆర్డినేషన్ సెంటర్ (జేఏసీసీ) గురువారం ప్రకటించింది.

వచ్చే ఏడాది అంటే 2016 ఏడాది మొదట్లో గాలింపు చర్యలు నిలిపివేస్తామని వెల్లడించింది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామో కూడా జేఏసీసీ వివరించింది. గాలింపు చర్యలు కఠినతరంగా ఉందని అలాగే ఖర్చు మరింత పెరిగిందని పేర్కొంది. విమానం కోసం లక్షా ఇరవై వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టామని... అందుకు సంబంధించిన చిన్న సమాచారం ఇప్పటి వరకు లభించలేదని విశదీకరించింది. అలాగే మలేసియా, చైనా, ఆస్ట్రేలియా పరిధిలో నేటి వరకు చేపట్టిన గాలింపు చర్యలను సంగతి ఈ సందర్భంగా జేఏసీసీ గుర్తు చేసింది. అయితే 2016 ఏడాది మొదట్లో ఎమ్హెచ్ 370 విమానం ఆచూకీ తెలుసుకుంటామని జేఏసీసీ ఆశాభావం వ్యక్తం చేసింది.  

విమాన ఆచూకీ కోసం ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 80 మిలియన్ డాలర్లు... మలేసియా 45 మిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని తెలిపింది. సముద్రంలో చలికాలంలో గాలింపు చర్యలకు ఎదురవుతున్న అవరోధాలను ఈ సందర్భంగా సోదాహరణగా వివరించింది. అలాగే విమాన ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత వేగవంతం చేస్తామని జేఏసీసీ స్పష్టం చేసింది. దాదాపు 50 వేల చదరపు కిలోమీటర్ల మేర సముద్రం అడుగుభాగంలో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేదని తెలిపింది. అయితే ఎమ్హెచ్ 370 విమానంలోని మొత్తం ప్రయాణికులు మరణించారని... వారి మృతదేహాలు... విమాన శిథిలాలు దొరికే అవకాశం లేదని మలేసియా ఉన్నతాధికారులు ఈ ఏడాది జనవరిలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం గత ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది.  బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు. ఈ విమానంలో మలేసియా వాసులు,  154 మంది చైనా జాతీయులతోపాటు ఐదుగురు భారతీయులు, నలుగురు ఫ్రెంచ్ జాతీయులు ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement