కౌలాలంపూర్ : బంగాళాఖాతంలోని మారిషస్ సముద్ర తీరంలో కనుగొన్న విమాన శకలం ఎమ్హెచ్ 370దే అని మలేషియా, ఆస్ట్రేలియా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మారిషస్ సముద్ర తీరంలో ఈ ఏడాది మేలో మారిషస్ సముద్ర తీరంలో ఓ విమాన శకలాన్ని గుర్తించారు. ఆ విమాన శకలాన్ని ఆస్ట్రేలియా రవాణ భద్రత సంస్థకు చెందిన నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించి... పరిశోధించారు. చిట్ట చివరకు ఆ విమాన శకలం 2014 మార్చి 4 వ తేదీన గల్లంతైన ఎమ్హెచ్ 370దే అని వారు నిర్ధారించారు.
మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన ఎమ్హెచ్ 370 విమానం 2014 మార్చి 8వ తేదీన 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో చైనా రాజధాని బీజింగ్కు బయలుదేరింది. ఆ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే... ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే రంగంలోని దిగిన మలేషియా, చైనా దేశాలు సైతం ఆ విమాన జాడకు కనిపెట్ట లేకపోయాయి. దీంతో ప్రపంచ దేశాలు సదరు విమానం కోసం జల్లెడ పట్టాయి.
అయినా ఫలితం లేకుండా పోయింది. విమానం గల్లంతు కావడంతో ప్రయాణికుల బంధువులు తీవ్ర కలత చెందారు. ఎమ్హెచ్ 370 విమానం ప్రమాదానికి గురైందని మలేషియా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
'ఆ శకలం... ఆ విమానానిదే'
Published Fri, Oct 7 2016 11:06 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
Advertisement