'నీటికోసం కొండచిలువల ఇళ్ల బాట'
ఆస్ట్రేలియా: తాగు నీరు కరువై పక్షులు వలస వెళ్లినట్లుగా ఆస్ట్రేలియాలో ఇప్పుడు పాములు వలస వెళుతున్నాయి. అది ఏ కొండప్రాంతానికో, మరో అటవీ ప్రాంతానికో అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు కానీ.. ఏకంగా ఇళ్లలోకి వస్తే మాత్రం గుండెలు జారీపోవాల్సిందే. ఇప్పుడు ఆస్ట్రేలియాలో పలువురు కుటుంబీకులు ఇదే భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. గత కొద్ది కాలంగా క్వీన్లాండ్ వర్షాలు కరువయ్యాయి. వడగాలులు ఎక్కువయ్యాయి. దీంతో ఆ చుట్టూపక్కల పాములు నీటి కోసం ఇళ్లబాట పట్టాయి.
టౌన్స్ విల్లేలోని ఓ ఇంటి కిచెన్ సింక్ లోకి, మురుగు నీరు పారే పైపులో, టాయిలెట్లోకి భారీ కొండ చిలువలు ప్రవేశించాయి. దాదాపు రెండు వారాలపాటు అందులో తల దాచుకున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ దృశ్యాలు హల్ చల్ చేస్తున్నాయి. పైథాన్లు ఉన్నట్లు గుర్తించిన కుటుంబీకులు పాములు పట్టేవాళ్లను పిలిపించి వాటిని బందించారు. అయితే, రానున్న రోజుల్లో వాతావరణం మెరుగుపడే పరిస్థితి ఉండకపోవచ్చని బహుశా మున్ముందు అందరూ తమ ఇళ్లల్లో మరిన్ని పాములను చూడాల్సి కూడా రావచ్చని ఓ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జేమ్స్ కుక్ తెలిపారు.