
సిడ్నీ : విషపూరిత పాములకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆస్ట్రేలియా గడ్డపై మరో భీకర పోరాటం చోటు చేసుకుంది. ఆకలితో ఉన్న రెండు భారీ పాములు (బ్రౌన్ స్నేక్, టైగర్ స్నేక్) కొట్లాటకు దిగాయి. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో గల నన్నెలా ప్రాపర్టీ బ్యాక్‌యార్డ్‌లో చోటు చేసుకుంది.
పాముల కొట్లాటను చూసిన ఓ వ్యక్తి దాన్ని రికార్డు చేసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో సంబంధిత వీడియో వైరల్‌గా మారింది. టైగర్ స్నేక్‌ను బలంగా చుట్టిపట్టిన బ్రౌన్ స్నేక్ పదునైన కోరలతో ప్రత్యర్థిపై దాడి చేసింది. అనంతరం టైగర్ స్నేక్ తలను మింగడం ప్రారంభించింది.
ఇంతలో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచెర్స్ వాటిని పట్టుకున్నారు. అయితే, సంరక్షణా గృహానికి తరలించేలోగా టైగర్ స్నేక్‌ను బ్రౌన్ స్నేక్ మింగేసినట్లు తెలిపారు. విషపూరిత పాములైన టైగర్ స్నేక్, బ్రౌన్ స్నేక్‌లు ఒకదానిపై మరొకటి దాడికి దిగడం చాలా అరుదని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment