ఒక్కడే ముగ్గురికి చుక్కలు చూపించాడు! | British passenger punches three police officers to the floor at German airport | Sakshi
Sakshi News home page

ఒక్కడే ముగ్గురికి చుక్కలు చూపించాడు!

Published Thu, Jul 28 2016 1:54 PM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM

ఒక్కడే ముగ్గురికి చుక్కలు చూపించాడు! - Sakshi

ఒక్కడే ముగ్గురికి చుక్కలు చూపించాడు!

ఓవైపు విమానం ఆలస్యమైంది. మరోవైపు అనారోగ్యంతో ఉన్న తన భార్య పట్ల సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఆమెను కిందపడేశారు. అంతే అతనికి కోపం కట్టలు తెంచుకుంది. ఒక్కడే పోలీసు అధికారులపై తిరుగబడ్డాడు. ముగ్గురు పోలీసులను ఒంటిచెత్తో చితకబాదాడు.

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన తాలుకు వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. 38 ఏళ్ల బ్రిటన్‌ వ్యక్తి ఇలా పోలీసు అధికారులపై దాడికి దిగాడు. ‘నేను బ్రిటిష్‌ పౌరుడిని’ అని కేకలు వేస్తూ అతడు పట్టరాని కోపంతో పోలీసు అధికారులను చితకబాదాడు. ఆడ, మగ తేడా లేకుండా కిందకుతోసేశాడు. అప్పటికే విమానం ఆలస్యమై.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వందలాది మంది ప్రయాణికులు అతనికి మద్దతు పలికారు. అతడు పోలీసులను కొడుతుంటే విజిల్స్‌తో, కేకలతో ప్రోత్సహించారు.

వాతావరణం బాగలేకపోవడంతో ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానాశ్రయంలో బుధవారం రాకపోకలు నిలిపివేశారు. దీంతో దాదాపు ఏడువేల మంది ప్రయాణికులు విమానాశ్రయంలో అవస్థలు పడ్డారు. ఈక్రమంలో తన భార్య పట్ల సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో బ్రిటన్‌ పౌరుడు ఇలా దాడికి దిగాడని లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ అధికారి ప్రతినిధి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement