తమిళనాడు: ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియో తీసి భార్యను బెదిరించిన భర్త, అతని తల్లి, తండ్రి సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. మదురైలోని ముత్తుపట్టి కృష్ణానగర్‌కు చెందిన రాజ్ కమలే . ఇతని భార్య మదురై సౌత్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్త తనను నగ్నంగా వీడియో తీసి సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడని, ఇందుకు అతని స్నేహితులు శరత్, అతని భార్య లిల్లీ, తల్లి రతి ప్రియా, తండ్రి పళని, సహోదరీ రాజ్య తిలకం సహకరిస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొ న్నారు.
ఆ వీడియోను డిలీట్ చేయకుండా సామాజికమాధ్యమాల్లో పెడుతానని బెదిరించినట్లు వాపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి కమలే, శరత్, లిల్లీ, రతిప్రియ, పళనిని అదుపులోకి తీసుకుని ప్రశి్నస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment