ఆయనపై 420 కేసు
న్యూఢిల్లీ: మద్యం వ్యాపారి విజయ్ మాల్యాపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ డిఫాల్ట్ కేసుకు సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 420 ప్రకారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం చీటింగ్ కేసు నమోదు చేసింది. ఈ సెక్షన్ కింద ఏడేళ్ల జైలు శిక్ష జరిమానా విధించే అవకాశం ఉంది.
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మాజీ అధిపతి మాల్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా 17 బ్యాంకులకు రుణాలు ఎగవేసి బ్రిటన్ కు పారిపోయాడు. దీంతో వడ్డీతో సహా దాదాపు 9వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిందిగా కోరుతూ బ్యాంకుల కన్సార్టియం సుప్రీంను ఆశ్రయించింది. దీంతోపాటు వివిధ నేరాల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) సహా వివిధ సంస్థలు మాల్యాపై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.